Jasprit Bumrah: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. మళ్లీ నెంబర్ స్థానంలోకి బుమ్రా
టీమిండియా సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (870 రేటింగ్ పాయింట్లు) ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతను రవిచంద్రన్ అశ్విన్ (869)ని వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో బుమ్రా, అశ్విన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ చెరో 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. అయితే అశ్విన్ కంటే బుమ్రా కొంచెం పొదుపుగా బౌలింగ్ చేశాడు. జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, కగిసో రబాడ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆరో స్థానంలో ఉన్నారు.
మూడో స్థానంలో యశస్వీ జైస్వాల్
ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో యశస్వీ జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని మూడో స్థానానికి ఎగబాకాడు. విరాట్ కోహ్లీ ఆరు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. రిషభ్ పంత్ మూడు స్థానాలు దిగజారి 9వ స్థానానికి పరిమితమయ్యాడు. రోహిత్ శర్మ టాప్ 10 నుంచి కిందకు పడిపోయాడు. ఐదు స్థానాలు దిగజారి 15వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో జో రూట్, కేన్ విలియమ్సన్ వరుసగా మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సమయంలోనూ బుమ్రా మొదటి స్థానంలో నిలిచాడు.
ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా 'బుమ్రా' రికార్డు
అప్పుడు మూడు స్థానాలు ఎగబాకి అశ్విన్‌ను వెనక్కినెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సుదీర్ఘ ఫార్మాట్‌లో అగ్రస్థానంలో నిలిచిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక తీసిన బౌలర్ కూడా బ్రుమానే. అతడు 7 మ్యాచ్‌ల్లో 38 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య కూడా 7 మ్యాచ్‌ల్లో 38 వికెట్లు పడగొట్టినా బౌలింగ్ యావరేజ్ పరంగా బుమ్రా మెరుగ్గా కొనసాగుతున్నాడు.