ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. మళ్ళీ టాప్-5కి వచ్చిన రోహిత్ శర్మ
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ టాప్-5లోకి వచ్చాడు. 751 రేటింగ్ పాయింట్లతో రోహిత్ ఒక స్థానం మెరుగుపరచుకుని ఐదవ స్థానంలో నిలిచాడు. వన్డే,టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఉన్న ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మనే. అలాగే, యశస్వి జైస్వాల్. విరాట్ కోహ్లీ వరుసగా ఒక్కో స్థానం మెరుగుపరచుకుని ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో శతకం సాధించిన శ్రీలంక బ్యాటర్ పాథుమ్ నిశాంక 42 స్థానాలు ఎగబాకి 39వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా,న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్
బౌలింగ్ విభాగంలో పెద్ద మార్పులు కనిపించడం లేదు. టీమ్‌ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌తో కలిసి బుమ్రా రెండవ స్థానాన్ని పంచుకుంటున్నారు. రవీంద్ర జడేజా ఏడవ స్థానంలో ఉండగా, కుల్‌దీప్ యాదవ్ 15వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా ఆరు నెలల విరామం తర్వాత మళ్లీ టెస్టులు ఆడబోతోంది. బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై సెప్టెంబరు 19 నుండి రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. తొలి టెస్టు సెప్టెంబరు 19-23 మధ్య చెన్నైలో, రెండో టెస్టు సెప్టెంబరు 27-అక్టోబర్ 1 మధ్య కాన్పూర్‌లో జరగనుంది.