
వరల్డ్ కప్ చరిత్రలో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లలో నమోదైన రికార్డులు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5వ తేదీ నుండి మొదలు కాబోతుంది. నవంబర్ 19 వరకు సాగే ఈ టోర్నమెంట్ కొనసాగనుంది.
అయితే వన్డే వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్ లో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో అసలు ప్రపంచకప్ లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచులు, వాటి విశేషాలు తెలుసుకుందాం.
ఇప్పటివరకు ప్రపంచకప్ లో ఏడుసార్లు పాకిస్తాన్ తో తలపడిన ఇండియా ఏడు విజయాలను ఖాతాలో వేసుకుంది.
ఈ విజయాల్లో చెప్పుకోదగ్గవాటిలో 1996లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్, 2011లోని సెమీఫైనల్ మ్యాచెస్ ఉన్నాయి.
Details
అత్యధిక మ్యాచులు గెలిచిన జట్టుగా టీమిండియా
ప్రపంచ కప్ లో పాకిస్తాన్ మీద ఎక్కువ మ్యాచులు గెలిచిన జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. పాకిస్తాన్ తో 11మ్యాచులాడిన వెస్టిండీస్ 8మ్యాచుల్లో విజయం సాధించింది.
అత్యధిక, అత్యల్ప స్కోర్ల వివరాలు
2019లో పాకిస్తాన్ పై టీమిండియా 336/5 స్కోర్ చేసింది. 2017లో కూడా పాకిస్తాన్ పై 300 పరుగుల మార్కును(300/7) టీమిండియా జట్టు అందుకుంది.
1992లో పాకిస్తాన్ పై టీమిండియా అత్యల్ప స్కోరు(216/7) నమోదు చేసింది.
2003లో టీమిండియా పై అత్యధిక స్కోరును(273/7) పాకిస్తాన్ చేయగలిగింది.
1992లో అత్యల్పస్కోరును (173/10) పాకిస్తాన్ నమోదు చేసింది.
Details
అత్యధిక పరుగులు, వికెట్లు తీసుకున్న ఆటగాళ్లు
ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (313) పేరు మీద ఉంది.
ఇండియా పై ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన పాకిస్తాన్ ఆటగాడిగా సయీద్ అన్వర్ (185) నిలిచాడు.
ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై సెంచరీ చేసిన వారిలో రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ ఉన్నారు.
పాకిస్తాన్ పై ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా వెంకటేష్ ప్రసాద్ (8 వికెట్లు) ఉన్నారు.
ఇండియా పై ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న పాకిస్తాన్ బౌలర్ గా వాహబ్ రియాజ్ (7 వికెట్లు) నిలిచాడు.