
Team India : ప్లేయర్లు గాయపడి విరామం తీసుకుంటే.. దేశవాళీ ఆడడం తప్పనిసరి : జైషా
ఈ వార్తాకథనం ఏంటి
దేశవాళీ క్రికెట్ కు ప్రాధాన్యత ఇచ్చేందుకు బీసీసీఐ కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే క్రికెటర్ల ఫిట్‌నెస్, ఫామ్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది.
ఒకానొక సమయంలో ప్లేయర్లు గాయపడి ఆటకు దూరమవుతారు.
ఇలాంటి ప్లేయర్లు జాతీయ జట్టులోకి రావాలంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శ జై షా వెల్లడించారు.
దీనిపై మరోసారి ఆయన స్పష్టతనిచ్చారు. ప్లేయర్లు ఫిట్‌నెస్ నిరూపించుకోవాలంటే డొమిస్టిక్ అత్యుత్తమ వేదిక అని జై షా వెల్లడించారు.
Details
సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ
ఈ విషయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలకు ప్రత్యేక మినహాయింపులు ఉంటాయన్నారు.
రెండేళ్ల కిందట రవీంద్ర జడేజా గాయపడి, కోలుకుంటే దేశవాళీలో ఆడమని తానే చెప్పామని, ఇప్పుడు అది తప్పనిసరి చేశామన్నారు.
విరామం తీసుకొని జాతీయ జట్టులోకి రావాలంటే తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలన్నారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ లాంటి ప్లేయర్లు ఒకవేళ దేశవాళీ అడి గాయపడితే జట్టుకు చాలా నష్టం కలుగుతుందన్నారు.
ఇక సెప్టెంబర్ 5 నుంచి జరిగే దులీప్ ట్రోఫీలో శుభ్‌మాన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ కెప్టన్లుగా వ్యవహరించనున్నారు.