
LSG vs CSK: ఇవాళ గెలవకపోతే.. చైన్నై ఫ్లేఆఫ్స్ కి దూరమయ్యే అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పటి విజేతలు, నాణ్యమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో టోర్నీలో అడుగుపెట్టిన చైన్నై సూపర్ కింగ్స్ (CSK) ఈసారి మాత్రం ఆశించిన ప్రదర్శన చూపడంలో విఫలమవుతోంది.
టోర్నీ ప్రారంభంలో విజయం సాధించినా, అప్పటినుంచి వరుస పరాజయాల పరంపర కొనసాగుతోంది.
ఇకపై ఒక్క గెలుపు దక్కితే తిరిగి రేసులోకి రావచ్చన్న నమ్మకం జట్టులో ఉన్నా, ఆ గెలుపు ఎప్పుడనేది మాత్రం మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
టోర్నీ ముందే సీఎస్కేపై భారీ అంచనాలు ఉండాయి. సమతూకమైన పేస్, స్పిన్ బలంతో పాటు, దూకుడు ఆటగాళ్ల బ్యాటింగ్ లైన్‌ప్ తోడుగా ఉండగా, మైదానంలో మాత్రం అంచనాలకు భిన్నంగా ఫలితాలొస్తున్నాయి.
ముఖ్యంగా డేవన్ కాన్వే అద్భుత ప్రదర్శన చూపించలేదు.
Details
గాయాల బెడద
ఒకవైపు రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా జట్టుకు దూరమవ్వడం తీవ్రంగా ప్రభావం చూపింది.
అతని స్థానంలో 17 ఏళ్ల ఆయుశ్ మాత్రే ఎంపికయ్యాడు కానీ అతడు ఏప్రిల్ 20న ముంబయితో మ్యాచ్‌కి మాత్రమే అందుబాటులోకి వస్తాడు.
ఇక దీపక్ హుడా ప్రదర్శన కూడా నిరాశ కలిగించడంతో, అతని స్థానంలో విజయ్ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే టీ20 మ్యాచ్‌కు కావలసిన వేగం అతనిలో కనిపించడం లేదు.
లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం ఫుల్ ఫాంలో ఉంది. నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రమ్, మిల్లర్, పంత్ లాంటి పవర్ హిట్టర్లు ఉన్న ఈ జట్టు స్వగృహంలో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతోంది.
ఈ దూకుడు ఆటగాళ్లను సీఎస్కే బౌలింగ్ ఎలా నిలిపివేస్తుందన్నది ఒక పెద్ద ప్రశ్న.
Details
తేలిపోతున్న జడేజా, అశ్విన్
సీనియర్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తేలిపోతున్నారు. ముఖ్యంగా అశ్విన్ తన ఫామ్‌కు దూరంగా కనిపిస్తున్నాడు.
మరోవైపు నూర్ అహ్మద్ మాత్రం మంచి ప్రదర్శనతో పర్పుల్ క్యాప్‌కి ఎదుగుతున్నాడు (ఇప్పటికే 12 వికెట్లు).
పతిరన పైనే పేస్ విభాగం ఆధారపడుతుండగా, ముకేశ్ చౌధరి, ఓవర్టన్ నుంచి సరైన మద్దతు లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.
Details
సీఎస్కేకి చావో రేవో
టోర్నీ మొదటి దశ ముగింపు దశలో ఉండగా, టాప్-4 జట్లు ఇప్పటికే నాలుగేసి విజయాలు నమోదు చేసుకున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఒక్క విజయంతోనే అట్టడుగున ఉన్న సీఎస్కే మిగతా అన్ని మ్యాచుల్లో గెలవకపోతే ప్లేఆఫ్స్ కల అసాధ్యమవుతుంది.
రుతురాజ్ గైర్హాజరీలో మళ్లీ ధోనీ కెప్టెన్సీ చేపట్టినా, తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. మానసికంగా కోలుకుని జట్టు బౌన్స్‌బ్యాక్ అయితేనే రేసులో నిలవగలదు.