
PSL 2025 Postponed: భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రభావం.. పీఎస్ఎల్ 2025 సీజన్ వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్‌ను వాయిదా వేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ప్రకటించింది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
మే 7 బుధవారం నుంచి ఇప్పటివరకు పీఎస్ఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. మే 8 గురువారం రావల్పిండిలో జరగాల్సిన కరాచీ కింగ్స్ వర్సెస్ పెషావర్ జల్మీ మ్యాచ్ కూడా రద్దయ్యింది.
ఈ మ్యాచ్‌కు ముందు భారత దళాలు రావల్పిండీ స్టేడియం సమీపంలో దాడులు చేయడంతో అధికారులు ఆ మ్యాచ్‌ను నిలిపివేశారు.
భద్రతా కారణాల దృష్ట్యా మిగిలిన పీఎస్ఎల్ మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మారుస్తామని పీసీబీ తొలుత ప్రకటించింది.
Details
టోర్నమెంట్‌ను తాత్కాలికంగా వాయిదా
రావల్పిండి, ముల్తాన్, లాహోర్‌లలో జరగాల్సిన చివరి ఎనిమిది మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.
అయితే చివరికి మొత్తం టోర్నమెంట్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది.
ఇక మరోవైపు, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2025 సీజన్ కూడా దేశంలో యుద్ధ వాతావరణం కొనసాగుతుండటంతో ఒక వారం పాటు వాయిదా పడింది.
దేశంలో తీవ్రమైన పరిస్థితుల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం సముచితం కాదని బీసీసీఐ తెలిపింది.
ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన బోర్డు, టోర్నీని తాత్కాలికంగా నిలిపివేసింది.
ప్రస్తుతం ఐపీఎల్‌లో 12 లీగ్ మ్యాచ్‌లు, రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్ మరియు ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ మే 25న కోల్‌కతాలో జరగాల్సి ఉంది.