LOADING...
US ఓపెన్ టైటిల్ డిఫెన్స్ నాలుగో రౌండ్‌లో ఒస్టాపెంకో చేతిలో ఓడిన ఇగా స్వైటెక్‌
US ఓపెన్ టైటిల్ డిఫెన్స్ నాలుగో రౌండ్‌లో ఒస్టాపెంకో చేతిలో ఓడిన ఇగా స్వైటెక్‌

US ఓపెన్ టైటిల్ డిఫెన్స్ నాలుగో రౌండ్‌లో ఒస్టాపెంకో చేతిలో ఓడిన ఇగా స్వైటెక్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2023
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి ఇగా స్వైటెక్‌ నాలుగో రౌండ్‌లో 20వ సీడ్‌ జెలెనా ఒస్తాపెంకో చేతిలో 6-3, 3-6, 1-6తో ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది. నాలుగో రౌండ్‌లో మొదటి నుండి ఆధిపత్యం కనబర్చిన స్వైటెక్‌ 6-3తో మొదటి సెట్‌ను గెలిచింది. ఆ సెట్ అనంతరం జెలెనా.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు ఏ దశలోనూ ఛాన్స్‌ ఇవ్వలేదు. దీంతో వరుసగా రెండు సెట్లు ఓడిపోయిన స్వైటెక్‌.. యూఎస్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించింది.

Details 

క్వార్టర్ ఫైనల్ కి  నొవాక్‌ జకోవిచ్‌ 

జెలెనా కూడా ఈ టోర్నీలో మొదటిసారి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ఆమె అమెరికాకు చెందిన 19ఏళ్ల కొకో గాఫ్‌తో తలపడనుంది. ఈ ఓటమితో స్వైటెక్‌ ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను కోల్పోయింది. దింతో నంబర్‌-2గా ఉన్న అరినా సబలెంక టాప్‌-1 కి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ క్వార్టర్ ఫైనల్ కి దూసుకెళ్లాడు. నాలుగో రౌండ్‌లో బోర్నా గోజోను 6-2, 7-5, 6-4తో ఓడించి క్వార్టర్స్‌లో అతడు 9వ సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌తో తలపడనున్నాడు.