Rohit Sharma : ఆసీస్ గడ్డపై ఏకైక భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో 1000 పరుగుల మైలురాయిని దాటిన మొదటి భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వ్యక్తిగత స్కోరు 2 పరుగుల వద్ద ఉన్న సమయంలో రోహిత్ ఈ అరుదైన రికార్డ్‌ను సాధించాడు. రోహిత్ తర్వాత స్థానాల్లో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని వంటి ప్రముఖ క్రికెటర్లు ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు.
వివరాలు
ఆసీస్ గడ్డపై వన్డేల్లో ఆస్ట్రేలియా పై అత్యధిక పరుగులు సాధించిన టీమ్ఇండియా బ్యాటర్లు వీరే..
* రోహిత్ శర్మ - 1000* రన్స్ *విరాట్ కోహ్లీ - 802 పరుగులు * సచిన్ టెండూల్కర్ - 740 పరుగులు ఎంఎస్ ధోని - 684 పరుగులు ఒవర్‌ఆల్‌గా చూస్తే, రోహిత్ శర్మ ఐదో ఆటగాడిగా ఈ ఘనతను సాధించారు. ఆయన కంటే ముందుగా వివ్ రిచార్డ్స్, డెస్మండ్ హెన్స్, కుమార్ సంగాక్కర, మహేల జయవర్ధనేలు ఈ రికార్డ్‌ను సృష్టించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.
🚨 HISTORY BY ROHIT SHARMA 🚨
— Johns. (@CricCrazyJohns) October 23, 2025
Rohit Sharma becomes the first Indian batter to score 1000 runs in Australia against Australia in ODI History. 🤯 pic.twitter.com/SJizcd6yLR