Page Loader
టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
గాయం నుంచి కోలుకోని డేవిడ్ వార్నర్

టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 09, 2023
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు మరో గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఈ ఇద్దరూ దూరమైన విషయం తెలిసిందే. తన తల్లి అనారోగ్యం కారణంగా మూడో టెస్టుకు ముందు కమ్మిన్స్ స్వదేశానికి వెళ్లాడు. కమ్మిన్స్ మరికొన్ని రోజులు తల్లి దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో అతడు వన్డే సిరీస్‌తో పాటు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం.

ఆస్ట్రేలియా

వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టు

కమిన్స్ వన్డే సిరీస్‌కు దూరమైతే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కి స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇక వార్నర్ తన చేతి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడం గమనార్హం. అతడు పూర్తి స్థాయి ఫిట్ నెస్ సాధించడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఇప్పటికే గాయం కారణంగా ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ జో రిచర్డ్‌సన్‌ కూడా భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్‌కమిన్స్(సి), సీన్అబాట్, అష్టన్‌అగర్, అలెక్స్‌కారీ, కామెరాన్‌గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, లాబుషాగ్నే, మిచెల్ మార్ష్, మాక్స్‌వెల్, నాథన్ఎల్లిస్, స్టీవ్‌స్మిత్, మిచెల్‌స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్‌వార్నర్, ఆడమ్ జంపా