బాగా అలసిపోయాను, కొంచె రెస్ట్ కావాలి: డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య విశ్రాంతి లేకుండా మ్యాచ్ లు ఆడుతున్నాడు. జింబాబ్వే, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ లతో జరిగిన వన్డే సిరీస్ లలో బిజిగా గడిపాడు. టీ20, టెస్టు సిరీస్‌లోనూ విరామం లేకుండా ఆస్ట్రేలియా తరుపున బరిలోకి దిగాడు. అదే విధంగా బీబీఎల్ లో సిడ్ని థండర్ తరుపున ఆడాడు. బీబీఎల్ సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ చేతిలో పరాజయం పాలైంది. ఈ సీజన్లో తాను తీవ్రంగా అలసిపోయానని, తనకు కొంచె విశ్రాంతి కావాలని మ్యాచ్ అనంతరం వార్నర్ విలేకర్ల సమావేశంలో తెలిపారు.
వచ్చే ఏడాది అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై..!
ఫిబ్రవరిలో టీమిండియా, ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్ జరగనుంది. మరో వారంలో ఇండియాకు వెళ్లేందుకు ఆస్ట్రేలియా జట్టు సిద్ధంగా ఉంది. భారత్ కు వెళ్లేందుకు కొన్ని రోజులు సమయం ఉందని, ఈ సమయంలో ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటానని, కచ్చితంగా టీమిండియాతో తాము రాణిస్తామని వార్నర్ తెలిపారు. వచ్చే ఏడాది తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికే అవకాశం ఉందని, 2024లో అమెరికా, వెస్టిండీస్ వేదికలగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కచ్చితంగా ఆడుతానని గతంలో వార్నర్ వెల్లడించిన విషయం తెలిసిందే.