NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND Vs AUS : టీమిండియా యువ క్రికెటర్ ముకేష్ కుమార్ అరుదైన ఘనత
    తదుపరి వార్తా కథనం
    IND Vs AUS : టీమిండియా యువ క్రికెటర్ ముకేష్ కుమార్ అరుదైన ఘనత
    టీమిండియా యువ క్రికెటర్ ముకేష్ కుమార్ అరుదైన ఘనత

    IND Vs AUS : టీమిండియా యువ క్రికెటర్ ముకేష్ కుమార్ అరుదైన ఘనత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 22, 2023
    04:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా యువ క్రికెటర్ ముఖేష్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టూరులో మూడు అంతర్జాతీయ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన రెండో భారతీయ ఆటగాడిగా నిలిచాడు.

    వెస్టిండీస్ పర్యటనలో తొలుత టెస్ట్ సిరీస్ ఆడిన ముకేష్, ఆ తర్వాత వన్డే సిరీస్, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో చోటు సంపాదించుకున్నాడు.

    విండీస్ రెండో టెస్టులో ఆడిన ముఖేష్ తొలి ఇన్నింగ్స్ లోనే రెండు వికెట్లు పడగొట్టాడు.

    ఇక వన్డే సిరీస్ తొలి మ్యాచ్ ద్వారా ఒక్క వికెట్ పడగొట్టాడు. రెండో వన్డేల్లో వికట్లేమీ సాధించలేదు.

    మూడో వన్డేల్లో మాత్రం మూడు వికెట్లతో విజృంభించాడు.

    రేపటి నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ కు ముందు ముకేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

    Details

    క్రమం తప్పకుండా దేశం కోసం ఆడాలని ఉంది

    తాను క్రమం తప్పకుండా దేశం కోసం ఆడాలనుకుంటున్నానని, అదే తన మొదటి విజయమని చెప్పారు.

    భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మతో తనకు ఎంతో మద్దతు పలికాడని, అతను చాలా విషయాలు నేర్పాడని వెల్లడించాడు.

    తాను భారత జట్టు సభ్యులను మొదటిసారి చూసినప్పుడు, తన మనస్సు కొద్దిసేపు పనిచేయడం మానేసిందని, తాను నిన్నటి వరకు టీవీలో వీక్షించిన ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకొనే అవకాశం రావడం అదృష్టమని పేర్కొన్నాడు.

    తాను బౌలింగ్ చేస్తున్నప్పుడు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మెచ్చుకున్నారని ముకేష్ గుర్తు చేశాడు.

    గతంలో క్రికెట్ కిట్ కొనడానికి తన దగ్గర డబ్బులు లేవని, తాను ఇంతకు ముందు బ్యాటింగ్ చేసేవాడిని, కానీ డబ్బు లేకపోవడంతో బౌలింగ్‌పై దృష్టి సారించామని చెప్పుకొచ్చాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    క్రికెట్

    తాజా

    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌

    టీమిండియా

    Team India: బెస్ట్ ఫీల్డర్ అవార్డు ఈసారి ఎవరికి దక్కిందో తెలుసా!  సూర్యకుమార్ యాదవ్
    ICC Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అడుగుమోపిన జట్లు ఇవే..! ఐసీసీ
    టీమిండియా- న్యూజిలాండ్ మ్యాచుకు అంపైర్లను ప్రకటించిన ఐసీసీ ఐసీసీ
    IND Vs NZ : ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే ప్రమాదమే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జోరుకు కివీస్ అడ్డుకట్ట వేయగలదా?  న్యూజిలాండ్

    క్రికెట్

    ఆసియా గేమ్స్ 2023: మొదటి రోజే.. 3 మెడల్స్‌తో ఖాతా తెరిచిన ఇండియా  ఆసియా క్రీడలు 2023
    IND vs AUS రెండో వన్డే: శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ రాణించకపోతే కష్టమే  క్రీడలు
    IND Vs AUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్  క్రీడలు
    IND Vs AUS: 3వేల సిక్సర్లతో టీమిండియా సరికొత్త రికార్డు! టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025