Page Loader
Ind Vs Ban: విజృంభించిన భార‌త బౌల‌ర్లు.. బంగ్లాదేశ్ 149 ఆలౌట్‌..
విజృంభించిన భార‌త బౌల‌ర్లు.. బంగ్లాదేశ్ 149 ఆలౌట్‌..

Ind Vs Ban: విజృంభించిన భార‌త బౌల‌ర్లు.. బంగ్లాదేశ్ 149 ఆలౌట్‌..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 20, 2024
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

చెపాక్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌పై పట్టు బిగిస్తోంది. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు కుప్పకూలింది, దీంతో భారత్‌కు 227 పరుగుల ఆధిక్యం లభించింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో షకీబ్ అల్ హసన్ 32, లిటన్ దాస్ 22, మెహిదీ హసన్ మిరాజ్ 27 (నాటౌట్), నజ్ముల్ హుస్సేన్ శాంటో 20 పరుగులు సాధించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీసాడు, కాగా ఆకాశ్ దీప్, జడేజా, సిరాజ్ లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

వివరాలు 

బంగ్లాదేశ్ బౌలర్  హసన్ మహమూద్ 5 వికెట్లు

అంతకముందు,భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్ 113 పరుగులు (133 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించి సెంచరీ చేశాడు. రవీంద్ర జడేజా 86 (124 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) యశస్వి జైస్వాల్ 56 (118 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్ 5 వికెట్లు తీశాడు, తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు, నహిద్ రానా మరియు మెహిదీ హసన్ మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.