Page Loader
IND vs ENG: మూడో టెస్ట్‌'లో ఎంట్రీ ఇవ్వనున్న బుమ్రా.. స్టార్ పేసర్ ఔట్!
మూడో టెస్ట్‌'లో ఎంట్రీ ఇవ్వనున్న బుమ్రా.. స్టార్ పేసర్ ఔట్!

IND vs ENG: మూడో టెస్ట్‌'లో ఎంట్రీ ఇవ్వనున్న బుమ్రా.. స్టార్ పేసర్ ఔట్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ vs భారత్ ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటివరకు రెండు జట్లు చెరో మ్యాచ్ గెలుచుకుని సమంగా నిలిచాయి. జూలై 10 నుంచి లార్డ్స్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై ఆధిక్యం సాధించాలనే లక్ష్యంతో ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడో టెస్టులో బరిలోకి దిగనున్నాడు. రెండో టెస్టు మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి జట్టులోకి రావడం భారత జట్టుకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. అయితే, మూడో టెస్టులో మరో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆడే అవకాశాలపై అనిశ్చితి నెలకొంది. మొదటి టెస్టులో సిరాజ్ మొత్తం 41ఓవర్లు వేసాడు. రెండో టెస్టులో 32ఓవర్లు బౌలింగ్ చేశాడు.

వివరాలు 

సిరాజ్‌కు విశ్రాంతినిచ్చే విషయమై జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచన..

రెండు మ్యాచ్‌లను కలిపి మొత్తం 73 ఓవర్లు వేసిన సిరాజ్ 9 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే రెండో టెస్టు అనంతరం మూడో టెస్టుకు కేవలం మూడు రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. వర్క్‌లోడ్ దృష్ట్యా సిరాజ్‌కు విశ్రాంతినిచ్చే విషయమై జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సిరాజ్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.ఒకవేళ సిరాజ్‌ను జట్టులో ఉంచినా.. రెండో టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అర్ష్‌దీప్‌ను ఆడించేందుకు అవకాశాలు ఉన్నాయి. మూడో టెస్టులో బుమ్రా,సిరాజ్,అర్ష్‌దీప్‌ ముగ్గురూ బరిలోకి దిగితే ఇంగ్లండ్ జట్టుపై గట్టి ఒత్తిడి తప్పదని నిపుణులు భావిస్తున్నారు.