IND vs ENG: ముగిసిన రెండు రోజు ఆట .. 255 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
ధర్మశాల టెస్టు రెండో రోజు మ్యాచ్‌లో టీమిండియా భారీ లీడ్‌లోకి దూసుకెళ్లింది. తొలి రోజు ఇంగ్లండ్‌ను కేవలం 218 పరుగులకే ఆలౌట్ చేసి, 135 పరుగులు చేసిన భారత జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. ఈ విధంగా భారత్ ఇప్పటి వరకు ఇంగ్లండ్‌పై 255 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. టీమిండియా తరుపున కెప్టెన్ రోహిత్ శర్మ(103),శుభ్‌మన్ గిల్(110) అద్భుతమైన సెంచరీలు చేశారు. కాగా, యశస్వి జైస్వాల్ (57), దేవదుత్ పడిక్కల్ (65),సర్ఫరాజ్ ఖాన్ (56) అర్ధశతకాలు సాధించారు. ఓవర్‌నైట్ 135/1 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ రెండో వికెట్‌కు రోహిత్, గిల్ ఏకంగా 161 పరుగులు జోడించారు.
అర్ధశతకాలు చేసిన పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వేసిన తొలి బంతికే రోహిత్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే, స్వల్ప వ్యవధిలో రోహిత్-గిల్ ఔట్ అయ్యారు. అరంగేట్ర బ్యాటర్ దేవదుత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ అర్ధశతకాలతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. మరోసారి ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించడంతో పడిక్కల్, ధ్రువ్ జురెల్ (15), రవిచంద్రన్ అశ్విన్ (0)ను ఔట్ అయ్యారు. వందో టెస్టు ఆడుతున్న అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం, కుల్‌దీప్ యాదవ్ - జస్‌ప్రీత్ బుమ్రా క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటికి వీరిద్దరూ కలిసి తొమ్మిదో వికెట్‌కు 108 బంతుల్లో 45 పరుగులు జోడించారు.