LOADING...
Abhishek Sharma : కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ ప్రపంచ రికార్డు..
కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ ప్రపంచ రికార్డు..

Abhishek Sharma : కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ ప్రపంచ రికార్డు..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా యువ స్టార్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల‌ను ఎదుర్కొని, 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 రన్స్ సాధించాడు. ఈ ప్రదర్శనలో అతడు పలు రికార్డులను నెలకొల్పాడు. అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో 5000 రన్స్ మైలురాయిని చేరిన అతి యువ ఆటగాడిగా చరిత్రలోకి ఎక్కాడు. ఈ ఘనతను అతి తక్కువ బంతుల్లో సాధించడం ద్వారా, అతడు దిగ్గజ ఆటగాడు ఆండ్రే రసెల్‌ను కూడా అధిగమించాడు. రసెల్‌కు 5000 రన్స్ పూర్తి చేయడానికి 2942 బంతులు అవసరం కాగా, అభిషేక్ కేవలం 2898 బంతుల్లోనే దీన్ని సాధించాడు.

వివరాలు 

పురుషుల టీ20 క్రికెట్‌లో 5 వేల ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్లు వీరే..

అభిషేక్ శ‌ర్మ - 2898 బంతుల్లో ఆండ్రీ ర‌స్సెల్ - 2942 బంతుల్లో టిమ్ డేవిడ్ - 3127 బంతుల్లో విల్ జాక్స్ - 3196 బంతుల్లో గ్లెన్ మాక్స్‌వెల్ - 3239 బంతుల్లో

వివరాలు 

టీ20ల్లో కివీస్ పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ..

మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దీని ద్వారా న్యూజిలాండ్‌పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు పూర్వంగా కేఎల్ రాహుల్,రోహిత్ శర్మకు సంయుక్తంగా మాత్రమే ఉండేది. వీరు 23 బంతుల్లో ఈ ఘనతను సాధించారు.రోహిత్ శర్మ 2020లో హామిల్టన్ వేదిక,కేఎల్ రాహుల్ 2020లో ఆక్లాండ్ వేదికపై ఈ రికార్డును సాధించారు. ఇంతకుముందు, టీ20లో 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం అభిషేక్ శర్మకు ఇది ఎనిమిదో సారి. ఈ సమయంలో అతను ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు ఫిల్ సాల్ట్‌ను కూడా అధిగమించాడు. ఫిల్ సాల్ట్ ఈ ఘనతను 7 సార్లు మాత్రమే సాధించాడు.

Advertisement

వివరాలు 

టీ20ల‌లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయ‌ర్లు వీరే..

అభిషేక్ శ‌ర్మ - 8 సార్లు ఫిల్ సాల్ట్ -7 సార్లు సూర్య‌కుమార్ యాద‌వ్ - 7 సార్లు ఎవిన్ లూయిస్ - 7 సార్లు అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రారంభమైన భారత్, 20 ఓవర్‌లలో 7 వికెట్ల నష్టానికి 238 రన్స్ సాధించింది. తరువాత, న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్‌లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 190 రన్స్ మాత్రమే చేయగలిగింది.

Advertisement