టీ20 సిరీస్‌పై కన్నేసిన టీమిండియా
న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో నెగ్గి సత్తా చాటింది. రెండో వన్డేలో వంద పరుగల లక్ష్యాన్ని చేధించడానికి టీమిండియా కష్టపడాల్సి వచ్చినా రెండో టీ20 గెలిచి సిరీస్ 1-1తో భారత్ సమం చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్, టీమిండియా మూడో టీ20ని అడనున్నాయి. ఈ మైదానంలో పేసర్ల కంటే స్పిన్నర్లే రాణించే అవకాశం ఉంది. ఈ స్టేడియంలో తొమ్మిది టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న జట్లు ఐదు సార్లు గెలుపొందాయి. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో రాత్రి 7గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఇరు జట్లలోని సభ్యులు
టీమిండియా ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ భారీ పరుగులు చేయడంలో వైఫల్యం చెందుతున్నారు. బ్యాటింగ్ లో టీమిండియా సూర్యకుమార్ యాదవ్ పై అధారపడి ఉంది. బౌలింగ్ లో స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ రాణించాలి.న్యూజిలాండ్ భారీ పరుగులు చేయాలంటే డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ ఫామ్ లోకి రావాల్సి ఉంటుంది. ఇష్ సోధీ, మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. భారత్: శుభ్‌మన్‌గిల్, ఇషాన్‌కిషన్ (వికెట్), త్రిపాఠి, సూర్యకుమార్, హార్దిక్ (సి), దీపక్‌హుడా, వాషింగ్టన్‌సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, చాహల్, అర్ష్‌దీప్ సింగ్. న్యూజిలాండ్: ఫిన్అలెన్, డెవాన్‌కాన్వే, చాప్‌మన్, డారిల్ మిచెల్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (సి), ఇష్ సోధి, జాకబ్‌డఫీ, ఫెర్గూసన్, టిక్నర్.