Page Loader
IND Vs PAK : 4-0తో పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్
4-0తో పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్

IND Vs PAK : 4-0తో పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 10, 2023
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

సొంతగడ్డపై జరుగుతున్న ఏషియన్ హకీ చాంపియన్స్ ట్రోఫీ లో ఆసియా ట్రోఫీ హకీ టోర్నీలో టీమిండియా దుమ్మురేపుతోంది. ఇప్పటికే ఒక్క ఓటమి లేకుండా సెమీస్ బెర్తును ఖరారు చేసుకున్న భారత హాకీ జట్టు, తాజాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించింది. బుధవారం జరిగిన చివరి రౌండ్ రాబీన్ లీగ్ మ్యాచులో భారత్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడి 4-0 గోల్స్ తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఇండియాలో చేతిలో ఓడిన పాకిస్థాన్ టోర్నీ నుంచి వైదొలిగింది. భారత్ ప్లేయర్లలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2, జుగ్ రాజ్ సింగ్, అక్షదీప్ సింగ్ చెరో గోల్ చేశాడు. ఈ మ్యాచులో ఆరంభం నుంచి పాకిస్థాన్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

Details

వందేమాతరం నినాదాలతో దద్దరిల్లిన స్టేడియం

తాజా విజయంతో టీమిండియా గ్రూప్ లో 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మ్యాచ్ విషయానికొస్తే.. ఫస్ట్ క్వార్టర్ లోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో భారత్ ఖాతా తెరిచింది. రెండో క్వార్టర్‌లో మరో పెనాల్టీ కార్నర్‌ను మళ్లీ గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. జుగ్ రాజ్ డ్రాగ్ ప్లిక్ తో బంతిని గోల్ చేయగా, చివరి క్వార్టర్ లో మనదీప్ సింగ్ మరో గోల్ కొట్టి భారత్ ఆధిక్యాన్ని 4కు పెంచాడు. ఈ మ్యాచ్ సందర్భంగా 'వందేమాతరం' నినాదాలతో మైదానం దద్దరిల్లింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.