IND vs SA ODI: విజృంభించిన టీమిండియా బౌలర్లు.. 116 పరుగులకే దక్షిణాఫ్రికా అలౌట్
జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు విజృంభించారు. దక్షిణాఫ్రికాను కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. తొలుత టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 27.3 ఓవర్లకే ఆలౌట్ అయ్యింది. టీమిండియాకు దక్షిణాఫ్రికా జట్టు 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదటి పవర్ ప్లేలోనే దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అర్ష్‌దీప్ 5, అవేష్ 4 వికెట్లతో ఏ దశలోనూ దక్షిణాఫ్రికా బ్యాటర్లను కోలుకోనివ్వలేదు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఆండిలే ఫెహ్లుక్వాయో ఒక్కడే 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.