శ్రీలంకతో జరిగే మొదటి వన్డేలో అదే ఫామ్ కొనసాగేనా..!
భారత్, శ్రీలంక మధ్య జనవరి 10న గౌహతిలో తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు తిరిగి వన్డేలోకి రానున్నారు. శ్రీలంక కూడా ఎలాగైనా వన్డే సిరీస్ ను సాధించాలని గట్టి ప్రయత్నంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ పై ఆసక్తి నెలకొంది. గౌహతి పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ రెండు వన్డే మ్యాచ్ లు జరగ్గా.. రెండుసార్లు ఛేజింగ్ జట్లే విజయం సాధించాయి. వన్డేల్లో శ్రీలంకపై భారత్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. చివరగా 2021లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ 2-1 సాధించింది.
తొలి వన్డేలో బరిలోకి దిగే టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇదే..
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, బుమ్రా, షమీ జట్టులోకి రానున్నారు. శ్రీలంకతో జరిగే తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ రానున్నట్లు సమాచారం. ఇషాన్ డబుల్ సెంచరీతో ఫామ్ లో ఉన్నాడు కాబట్టి.. శుభమాన్ గిల్ చెంచ్ మీద కూర్చోవలసి ఉంది. మూడో నంబర్లో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదోస్థానంలో రాహుల్, ఆరో స్థానంలో హార్ధిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఉమ్రాన్ మాలిక్.