శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన మహ్మద్ సిరాజ్
హైదరాబాద్ ఫేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత్ బౌలింగ్ అదరగొడుతున్నాడు. తన స్పీడ్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లో వికెట్లు తీస్తూ భారత్ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. మొన్న శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లోనూ మెరుగ్గా రాణించాడు. ఆదివారం శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో మహ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్ తో శ్రీలంక బ్యాటర్ల నడ్డి విరిచాడు. ఈ క్రమంలో 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లను పడగొట్టాడు. దీంతో శ్రీలంక 73 పరుగులకే ఆలౌటైంది. ముఖ్యంగా సిరాజ్ వన్డే క్రికెట్‌లో రికార్డులను బద్దలు కొడుతున్నాడు. అయితే నాలుగు వికెట్లు తీసిన సిరాజ్.. త్రుటిలో ఐదు వికెట్లు తీసే ఛాన్స్ ను మిస్ అయ్యాడు.
వన్డే చరిత్రలో భారత్‌కు అతిపెద్ద విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ శుభారంభం అందించారు. గిల్ వన్డేలో రెండో వన్డే సెంచరీని నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ అద్భుత శతకంతో వన్డేలో 46 వ సెంచరీని పూర్తి చేశారు. దీంతో భారత్ 390/5 భారీ స్కోర్ చేసింది. నువనిందు ఫెర్నాండో(19), డసన్ షనక(11), కసున్ రజిత(13 నాటౌట్) మినహా ఎవరూ డబుల్ డిజిట్ స్కోర్ చేయకపోవడం గమనార్హం. భారత బౌలర్లలో సిరాజ్‌కు తోడుగా.. మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అషెన్ బండార గాయం కారణంగా బ్యాటింగ్ రాలేదు. వన్డే క్రికెట్ చరిత్రలోనే భారీ విజయాన్ని టీమిండియాకు దక్కడంతో సిరాజ్ ప్రముఖ పాత్ర పోషించాడు.