
INDw Vs WIw: రెండో వన్డేలో భారత మహిళల జట్టు భారీ స్కోరు.. హర్లీన్ డియోల్ సెంచరీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల జట్టు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న తర్వాత, వన్డే సిరీస్‌ను కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సాధించేలా ఉంది.
ఇవాళ జరిగిన రెండో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో టీమ్ ఇండియా 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.
వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ 115 పరుగులు (103 బంతుల్లో 16 ఫోర్లు) చేసి శతకం సాధించింది.
ఓపెనర్ స్మృతి మంధాన 53 పరుగులు (47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసి ఐదో అర్ధ సెంచరీ సాధించింది.
మరో ఓపెనర్ ప్రతీకా రావల్ 76 పరుగులు (86 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్)బాదించి మంచి ప్రదర్శన కనబరిచింది.
వివరాలు
భారత్ వన్డేల్లో 350 పరుగుల మించి స్కోరు చేయడం ఇది రెండోసారి
జెమీమా రోడ్రిగ్స్ 52 పరుగులు (36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) చేసి హాఫ్ సెంచరీ సాధించింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 22 పరుగులు చేసింది. భారత్ వన్డేల్లో 350 పరుగుల మించి స్కోరు చేయడం ఇది రెండోసారి.
2022లో ఐర్లాండ్‌పై కూడా ఇలాగే 358/5 స్కోరు చేసింది. మంధాన, ప్రతీకా జోడీ తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోరు సాధించడానికి బలమైన పునాది వేశారు.
వివరాలు
98 బంతుల్లో శతకం
ఆ తర్వాత ప్రతీకా, హర్లీన్ కలిసి జోరుగా ఆడారు. 62 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన హర్లీన్ తర్వాత మరింత దూకుడు పెంచింది.
డాటిన్ వేసిన 45వ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదించి 98 బంతుల్లో శతకం పూర్తి చేసింది.
జైదా జేమ్స్ వేసిన 46వ ఓవర్‌లో జెమీమా నాలుగు బౌండరీలు రాబట్టింది.
ఇన్నింగ్స్ చివరలో రిచా ఘోష్ (13*) రెండు ఫోర్లు బాదింది, తద్వారా స్కోరు 358/5కి చేరింది.
విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, జైదా జేమ్స్, క్వినా జోసెఫ్, డాటిన్ ఒక్కో వికెట్ తీశారు.