Loading...
Rohit Sharma : వెస్టిండీస్‌తో రెండో వన్డే.. రోహిత్ శర్మ ముందున్న అరుదైన రికార్డు
వెస్టిండీస్‌తో రెండో వన్డే.. రోహిత్ శర్మ ముందున్న అరుదైన రికార్డు

Rohit Sharma : వెస్టిండీస్‌తో రెండో వన్డే.. రోహిత్ శర్మ ముందున్న అరుదైన రికార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2026
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ నేడు (సెప్టెంబర్ 30, బుధవారం) జరగనుంది. ఈ మ్యాచ్‌కు గౌహతి వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి వన్డేలో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. రెండో మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.

వివరాలు 

రోహిత్ శర్మను ఊరిస్తున్న అరుదైన రికార్డు

రెండో వన్డేకు ముందు టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 73పరుగులు సాధిస్తే వన్డేల్లో 12వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.

తద్వారా వన్డే క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు.

ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మాత్రమే భారత్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్నారు.

2007లో వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ఇప్పటివరకు 289 మ్యాచ్‌లు ఆడాడు.

48.9 సగటుతో 11,927 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 34 శతకాలు, 64 అర్ధశతకాలు ఉన్నాయి.

వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా రోహిత్ పేరిట 264 పరుగుల రికార్డు కొనసాగుతోంది.

వివరాలు 

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు

అంతేకాకుండా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా కూడా హిట్‌మ్యాన్ నిలిచాడు.

సచిన్ టెండూల్కర్ - 463 వన్డేల్లో 18,426 పరుగులు

విరాట్ కోహ్లీ - 315 వన్డేల్లో 15,080 పరుగులు

రోహిత్ శర్మ - 289 వన్డేల్లో 11,927 పరుగులు

సౌరవ్ గంగూలీ - 308 వన్డేల్లో 11,221 పరుగులు

రాహుల్ ద్రవిడ్ - 340 వన్డేల్లో 10,768 పరుగులు

ADVERTISEMENT

వివరాలు 

200 వికెట్లకు రెండు అడుగుల దూరంలో కుల్దీప్

రోహిత్ శర్మతో పాటు టీమ్‌ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ మ్యాచ్‌లో ఓ కీలక మైలురాయికి చేరువలో ఉన్నాడు.

వన్డేల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరేందుకు కుల్దీప్‌కు మరో రెండు వికెట్లు మాత్రమే అవసరం.

ఈ ఘనత సాధిస్తే వన్డేల్లో 200 వికెట్లు తీసిన తొమ్మిదో భారత బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు.

2017లో వన్డే అరంగేట్రం చేసిన కుల్దీప్ యాదవ్ ఇప్పటివరకు 122 మ్యాచ్‌లు ఆడి 198 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 4 వికెట్ల ఘనతను 10 సార్లు, 5 వికెట్ల ఘనతను రెండుసార్లు నమోదు చేశాడు.

ADVERTISEMENT

వివరాలు 

200 వికెట్లకు రెండు అడుగుల దూరంలో కుల్దీప్

వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

కుంబ్లే 269 వన్డేల్లో 334 వికెట్లు పడగొట్టాడు. దీంతో గౌహతి వేదికగా జరగనున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ 12 వేల పరుగుల మైలురాయిని, కుల్దీప్ యాదవ్ 200 వికెట్ల ఘనతను అందుకుంటారా అనే ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT