LOADING...
IND vs WI : మొదటి టెస్టుకు వరుణుడి ముప్పు ఉందా..?
IND vs WI : మొదటి టెస్టుకు వరుణుడి ముప్పు ఉందా..?

IND vs WI : మొదటి టెస్టుకు వరుణుడి ముప్పు ఉందా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 12, 2023
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో టీమిండియా పరాజయం తర్వాత దాదాపు నెల రోజులు విరామం తీసుకుంది. నేటి నుంచి కరేబియన్ గడ్డపై వెస్టిండీస్‌తో భారత్ టెస్టు సిరీస్ ఆడనుంది. డొమినికా వేదికగా తొలిటెస్టు ప్రారంభం కానుంది. ఐపీఎల్, దేశవాళీ టోర్నీలో సత్తా చాటిన యువ ఆటగాళ్లకు భారత జట్టు ప్రాధాన్యత కల్పించింది. ఐపీఎల్‌లో పరుగుల వరద పాటించిన యశస్వీ జైస్వాల్ విండీస్‌తో తొలి టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేయబోతున్నాడు. తనతో పాటు జైస్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు. ఇక శుభమాన్ గిల్ నంబర్ 3లో బ్యాటింగ్ చేయనున్నాడు.

Details

మొదటి రోజు పేసర్లకు అనుకూలం

మొదటి రోజు తొలి టెస్టులో ఆకాశం మేఘావృతమై, ఉదయం 25-31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతతో 59 శాతం మేఘాలు ఉంటాయి. అయితే సాయంత్రానికి క్లౌడ్ కవర్ 79 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. మ్యాచ్ మొదటి, చివరి రోజు వర్షం పడే ఛాన్స్ ఉంది. పిచ్ మొదటి రోజు పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. తర్వాతి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. ఈ టెస్టు మ్యాచులో వికెట్ కీపర్‌ స్థానం కోసం కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ మధ్య పోటీ నెలకొంది. లేటు వయసులో సత్తాచాటి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన పేస్ బౌలర్ ముకేశ్ అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు