Page Loader
IND vs WI : మూడో వన్డేలో బద్దలైన రికార్డులివే!
IND vs WI : మూడో వన్డేలో బద్దలైన రికార్డులివే!

IND vs WI : మూడో వన్డేలో బద్దలైన రికార్డులివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2023
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో టీమిండియా 200 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. విండీస్ పై భారత్ కు ఇది రెండో అతిపెద్ద విజయం కావడం గమనార్హం. గతంలో ముంబైలో 2018లో జరిగిన మ్యాచులో భారత్ 224 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే. విండీస్ పై భారత్ వరుసగా 13వ వన్డే సిరీస్ ను గెలుచుకుంది. 2007-2023 మధ్య ఈ విజయాలను భారత జట్టు సాధించింది.

Details

రెండో స్థానంలో పాకిస్థాన్ జట్టు

భారత్ తర్వాత జింబాబ్వేపై పాకిస్థాన్ వరుసగా 11 విజయాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. 1996-2023 మధ్య ఈ విజయాలను పాకిస్థాన్ జట్టు సాధించింది. శ్రీలంకపై వరుసగా పది సిరీస్ విజయాలను సాధించిన నాలుగో జట్టుగా భారత జట్టు ఉంది. టీమిండియా ఓపెనర్లు ఇషాన్ కిషాన్-శుభమన్ గిల్ తొలి వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విండీస్ జట్టుపై భారత్ కు ఇదే అత్యుత్తమ తొలి వికెట్ భాగస్వామ్యం కావడం విశేషం. 2017లో ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన మ్యాచులో శిఖర్ ధావన్, అంజిక్యా రహానే కలిసి 132 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఆ రికార్డును ఇషాన్, శుభమన్ గిల్ బద్దలు కొట్టారు.