Ind vs Ban: భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 376/10
భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. శుక్రవారం, ఓవర్ నైట్ స్కోరు 339/6తో కొనసాగిన టీమిండియా, 91.2 ఓవర్లలో 376 పరుగులకి కుప్పకూలింది. వెటరన్ క్రికెటర్ అశ్విన్ 113 పరుగులు (133 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించి, టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ రోజు తొలి సెషన్‌లో రవీంద్ర జడేజా 86 (124 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) వికెట్ చేజార్చడంతో, టీమ్‌కు ఓవర్నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించలేకపోయింది. తర్వాత వచ్చిన అక్షదీప్ 17 (30 బంతుల్లో 4 ఫోర్లు) దూకుడుగా ఆడినా ఔటయ్యాడు.జస్‌ప్రీత్ బుమ్రా 7, మమ్మద్ సిరాజ్ 0 నాటౌట్‌తో నిరాశ పరిచారు.
హసన్ మహ్మద్ 5 వికెట్లు
బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్మద్ 5 వికెట్లు,తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు,నహీద్ రాణా, మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. తొలి రోజు అశ్విన్, జడేజా బ్యాటింగ్‌లో తడబడిన టీమిండియా పరిస్థితిని మెరుగుపరిచారు. కెప్టెన్ రోహిత్ శర్మ (6), శుభమన్ గిల్ (0), విరాట్ కోహ్లీ (6) తక్కువ స్కోరుకు వెనుదిరిగారు,అయితే రిషబ్ పంత్ (39: 52 బంతుల్లో 6 ఫోర్లు) యశస్వి జైశ్వాల్ (56: 118 బంతుల్లో 9 ఫోర్లు) కొంత సమయం వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయినప్పటికీ, భారత జట్టు 42.2 ఓవర్లలో 144/6 వద్ద కష్టాల్లో పడింది, కానీ అశ్విన్, జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీమ్‌కు ఆశలు నింపారు.
అశ్విన్, రవీంద్ర జడేజా భారీ సిక్సర్లు
చెన్నై సూపర్ కింగ్స్‌కి సుదీర్ఘకాలం ఆడిన జడేజాకి చెపాక్ పిచ్ అనుకూలంగా మారింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు తడబడిన పిచ్‌పై అశ్విన్, రవీంద్ర జడేజా భారీ సిక్సర్లు కొట్టారు. దాంతో మొదటి రెండు సెషన్లలో భారత్ బ్యాటర్లని ఇబ్బందిపెట్టిన బంగ్లాదేశ్ బౌలర్లు చివరి సెషన్‌లో చేతులెత్తేశారు. అశ్విన్, జడేజా 199 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అశ్విన్ సెంచరీ సాధించాడు. చివరి అరగంటలో ఈ జోడీ వన్డే తరహాలో హిట్టింగ్ చేసింది, చివరి 10 ఓవర్లలో 56 పరుగులు సాధించింది.
చెపాక్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకి అనుకూలం
చెపాక్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకి అనుకూలమైనప్పటికీ,ఇప్పుడు స్పిన్నర్లకి సహకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెన్నై వేడి వాతావరణం పిచ్‌పై చిన్న పగుళ్లు తెచ్చే అవకాశం ఉంది.అయితే క్యూరేటర్ జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ పిచ్‌పై పగుళ్లు వస్తే మాత్రం బంతి విపరీతంగా తిరిగే ప్రమాదం ఉంటుంది. బంగ్లాదేశ్ టీమ్‌లో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు.