Loading...
India A vs Pakistan A: ఆసియా కప్‌లో నేడు దాయాదుల సమయం...దోహాలో పెరిగిన ఉత్కంఠ
ఆసియా కప్‌లో నేడు దాయాదుల సమయం...దోహాలో పెరిగిన ఉత్కంఠ

India A vs Pakistan A: ఆసియా కప్‌లో నేడు దాయాదుల సమయం...దోహాలో పెరిగిన ఉత్కంఠ

వ్రాసిన వారు Balachander Sharma
Nov 22, 2026
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

నవంబర్‌ 22.. క్రికెట్‌ అభిమానుల చూపంతా దోహా వైపే. ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో భాగంగా భారత్‌ A, పాకిస్థాన్‌ A జట్లు నేడు తలపడనున్నాయి. గ్రూప్‌-Bలో జరిగే ఈ మ్యాచ్‌ సాధారణ పోరులా కనిపించినా.. రెండు జట్ల మధ్య ఉన్న ప్రత్యర్థిత్వం కారణంగా ఉత్కంఠకు కొదవ ఉండదు. ఇప్పటికే టోర్నీలో ఘన విజయాలు సాధించిన ఇరు జట్లు మరోసారి తమ సత్తా చూపేందుకు సిద్ధమయ్యాయి.

Details

నేపాల్‌పై భారత్‌ A విధ్వంసం

భారత్‌ A జట్టు ఈ మ్యాచ్‌కు ముందు అద్భుతమైన ఊపులో ఉంది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 306 పరుగుల భారీ తేడాతో గెలిచింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ A 50 ఓవర్లలో 9 వికెట్లకు 332 పరుగులు చేసింది. కుమార్‌ కుశాగ్ర 117, తిలక్‌ వర్మ 107 పరుగులతో సెంచరీలు బాదారు.

చివర్లో సిద్ధార్థ్‌ షెడ్గే కేవలం 14 బంతుల్లోనే 36 పరుగులు చేసి స్కోరును మరింత పెంచాడు.

Details

భారత యువ బౌలర్ల దెబ్బకు నేపాల్‌ విలవిల

333 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది.

కేవలం 26 పరుగులకే ఆలౌటైంది. యువ పేసర్లు హర్షిత్‌ రాణా, ప్రిన్స్‌ యాదవ్‌ నిప్పులు చెరిగారు.

ప్రిన్స్‌ యాదవ్‌ ఐదు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్‌ రాణా నాలుగు వికెట్లు తీశాడు. షాబాజ్‌ అహ్మద్‌కు ఒక వికెట్‌ దక్కింది. దీంతో భారత్‌ A 306 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.

ADVERTISEMENT

Details

పాకిస్థాన్‌ A కూడా మంచి జోరులోనే

మరోవైపు పాకిస్థాన్‌ A జట్టు కూడా విజయంతోనే టోర్నీని ప్రారంభించింది.

నవంబర్‌ 20న యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో గెలిచింది. పాకిస్థాన్‌ A 245 పరుగులకు ఆలౌటవగా.. షమిల్‌ హుస్సేన్‌ 62, మాజ్‌ సాదాఖత్‌ 53 పరుగులు చేశారు.

లక్ష్య ఛేదనలో యూఏఈ 184 పరుగులకే కుప్పకూలింది. అలీ రజా, సుఫ్యాన్‌ ముకీమ్‌ చెరో మూడు వికెట్లు తీశారు. దీంతో ఇరు జట్లు విజయాల జోరుతో దోహా పోరుకు చేరుకున్నాయి.

ADVERTISEMENT

Details

ఎవరి జోరు కొనసాగుతుందో?

భారత్‌ A బ్యాటింగ్‌లో కుశాగ్ర, తిలక్‌ వర్మ వంటి ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు పెద్ద బలం. బౌలింగ్‌లోనూ ప్రిన్స్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా ఇప్పటికే తమ ప్రభావం చూపించారు.

పాకిస్థాన్‌ A కూడా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమతూకంగా కనిపిస్తోంది. దీంతో దోహాలో జరగబోయే ఈ పోరు కేవలం మరో గ్రూప్‌ మ్యాచ్‌గా కాకుండా.. యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను చూపించుకునే కీలక వేదికగా మారింది.

అభిమానులకు మాత్రం దాయాదుల సమరం కావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది.

ADVERTISEMENT