ICC: 2031 వన్డే ప్రపంచకప్‌కు భారత్, బంగ్లాదేశ్ ఆతిథ్యం.. ఐసీసీ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
2035 వరకు నిర్వహించనున్న పురుషుల క్రికెట్ ఐసీసీ టోర్నీల షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఖరారు చేసింది. ఆదివారం జరిగిన ఐసీసీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భారత్‌కు పలు కీలక టోర్నీల ఆతిథ్య హక్కులు దక్కాయి. 2031 వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం 2031లో భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా వన్డే ప్రపంచకప్ (ODI World Cup) నిర్వహించనున్నాయి. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 23 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇక 2029 అక్టోబర్ 9 నుంచి 28 వరకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. చివరిసారిగా 2006లో భారత్ ఈ టోర్నీకి వేదికగా నిలిచింది.
వివరాలు
టీ20 ప్రపంచకప్‌లకు ఆతిథ్య దేశాలు
2028 టీ20 ప్రపంచకప్ (T20 World Cup) టోర్నీని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
2030లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఆతిథ్యమివ్వనున్నాయి.
ఈ మేరకు 2035 వరకు పురుషుల క్రికెట్ ఈవెంట్ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఖరారు చేసింది.