Page Loader
IND Vs SL : భారత్, శ్రీలంక మ్యాచ్ జరగడం అనుమానమే.. ఎందుకంటే?
భారత్, శ్రీలంక మ్యాచ్ జరగడం అనుమానమే.. ఎందుకంటే?

IND Vs SL : భారత్, శ్రీలంక మ్యాచ్ జరగడం అనుమానమే.. ఎందుకంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2023
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా నేడు శ్రీలంక, భారత జట్లు పోటీపడనున్నాయి. మంగళశారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని రోజులుగా కొలంబోలో తుఫాను కారణంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన భారత్, పాక్ మ్యాచ్ కూడా ఆగిపోయింది. అయితే మ్యాచును రిజర్వ్ డే కు మార్చడంతో మ్యాచును సోమవారం నిర్వహించారు. ఈ మ్యాచులో పాకిస్థాన్ పై భారత్ 228 పరుగుల తేడాతో గెలుపొందింది.

Details

 భారత్, శ్రీలంక మ్యాచుకు రిజర్వ్ డే లేదు

భారత్, శ్రీలంక మధ్య జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు 60శాతం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆకాశం 98శాతం మేఘావృతమై ఉండి, ఉష్ణోగ్రత మాత్రం 28 డిగ్రీలకు చేరువలో ఉంటుందని సమాచారం. మ్యాచ్ జరిగేకొద్దీ వర్షం పడే అవకాశాలు తగ్గుముఖం పడుతామని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాయంత్రానికి వర్షం పడే అవకాశాలు 43 శాతానికి తగ్గిపోతాయట. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే టీమిండియా, శ్రీలంకకు చేరో పాయింట్ లభిస్తాయి. ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే లేదు. కావున వర్షం వల్ల మ్యాచ్ ఆగితే, మ్యాచును పూర్తిగా అంపైర్లు నిలిపివేస్తారు.