Paris Olympics Day 11 : రంగంలోకి నీరజ్ చోప్రా.. మళ్లీ గోల్డ్ తీసుకొస్తాడా?.. ఈరోజు భారత్ పాల్గొనే ఈవెంట్స్ ఇవే
పారిస్ ఒలింపిక్స్ లో 10 రోజులు ముగిశాయి. నేడు 11వ రోజు.ఈరోజు జరిగే ఈవెంట్ లో గత ఒలింపిక్స్ లో అసలు అంచనాలు లేకుండా దిగి ఏకంగా గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. తొలిసారి తలపడబోతున్నాడు. అతని కంటే ముందు టీనేజర్ జెనా కూడా జావెలిన్ త్రోలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కాగా మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టనుంది. ఇండియన్ హాకీ టీమ్ కూడా సెమీఫైనల్లో ఆడనుంది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 3 పతకాలు సాధించింది. షూటింగ్‌లో ముగ్గురూ కాంస్యం సాధించారు.
ఈ రోజు భారత షెడ్యూల్
మధ్యాహ్నం 1.30 - పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు (ప్రీ-క్వార్టర్ ఫైనల్): భారత్ (హర్మీత్ దేశాయ్, శరత్ కమల్, మానవ్ ఠక్కర్) vs చైనా మధ్యాహ్నం 1.50 - పురుషుల జావెలిన్ త్రో (అర్హత): కిషోర్ జెనా మధ్యాహ్నం 2.30 - మహిళల 68 కేజీల రెపెచేజ్ (రెజ్లింగ్): నిషా దహియా(అర్హత సాధిస్తే) మధ్యాహ్నం 2.50 - మహిళల 400మీ(రెపెచెచె): కిరణ్ పహల్ మధ్యాహ్నం 3.00 - మహిళల 50 కిలోల రౌండ్ ఆఫ్ 16 (రెజ్లింగ్): వినేష్ ఫోగట్(అప్పటికి అర్హత సాధిస్తే సూపర్-8, సెమీ-ఫైనల్ కూడా ఈరోజు) మధ్యాహ్నం 3.20 - పురుషుల జావెలిన్ త్రో (అర్హత):నీరజ్ చోప్రా రాత్రి 10.30 - పురుషుల హాకీ సెమీఫైనల్: భారత్ vs జర్మనీ