Asia Cup : నేడు భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్.. వర్షం ప్రభావం చూపుతుందా?
ఆసియా కప్ 2023 ఫైనల్‌కు ఇప్పటికే భారత జట్టు చేరుకుంది. ఇక సూపర్-4 చివరి మ్యాచులో బంగ్లాదేశ్ తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. శ్రీలంకలోని కొలంబో వేదికగా నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరగనుంది. నేడు కొలంబోలో వర్షం పడే ఛాన్స్ 65శాతం వరకు ఉంది. మధ్యాహ్నం, సాయంత్రం కూడా స్వల్పంగా వర్షం పడే అవకాశం ఉంది. 90శాతం వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఛానెళ్లలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక కొలంబోలో గురువారం పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఇరు జట్లలోని ఆటగాళ్లు వీరే
ESPNcricinfo ప్రకారం, టోర్నమెంట్ హోస్ట్ అయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కొలంబోలోని గేమ్‌లను హంబన్‌టోటాకు తరలించాలని కోరింది. అయితే వేదికల్లో ఎలాంటి మార్పులు చేయమని ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్ వారికి ఈమెయిల్ పంపింది. బంగ్లాదేశ్ జట్టు మహ్మద్ నైమ్, మెహిదీ హసన్ మిరాజ్, లిట్టన్ దాస్ (WK), షకీబ్ అల్ హసన్ (C), తౌహిద్ హృదయ్, అఫీఫ్ హొస్సేన్, షమీమ్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నసుమ్ అహ్మద్. భారత జట్టు రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (డబ్ల్యుకె), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.