Page Loader
Asian Games: ఆసియా గేమ్స్‌లో భారత్ బోణీ.. బంగ్లాపై ఘన విజయం
ఆసియా గేమ్స్‌లో భారత్ బోణీ.. బంగ్లాపై ఘన విజయం

Asian Games: ఆసియా గేమ్స్‌లో భారత్ బోణీ.. బంగ్లాపై ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2023
06:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఫుట్ బాల్ జట్టు ఆసియా గేమ్స్‌లో ఎట్టకేలకు శుభారంబాన్ని అందించింది. నాకౌట్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. ఉత్కంఠంగా సాగిన మ్యాచులో 1-0 తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రీ గోల్ చేసి భారత జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో భారత్ నాకౌట్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

Details

మయన్మార్ తో తలపడనున్న భారత జట్టు

భారత్ తొలి మ్యాచులో దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. మొన్న చైనాతో జరిగిన మ్యాచులో 1-5 తేడాతో ఇండియా చిత్తుగా ఓడిపోయింది. భారత ఆటగాడు రాహుల్ కెపీ ఒక్కడే గోల్ చేశాడు. మిగతా వాళ్లు విఫలం కావడంతో ఆ మ్యాచులో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇక సెప్టెంబర్ 24న భారత జట్టు మయన్మార్‌తో తలపడనుంది.