
Hockey Asia Cup: ఆసియా కప్ ఫైనల్లో కొరియా చిత్తు.. నాలుగో టైటిల్‌తో మెరిసిన భారత జట్టు
ఈ వార్తాకథనం ఏంటి
భారత హకీ జట్టు ఆసియా కప్‌లో ఘనవిజయం సాధించింది. ఫైనల్లో దక్షిణ కొరియాను చిత్తుగా ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో భారత్ తన నాలుగో ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకోవడంతో పాటు ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్‌లో చోటును కూడా ఖాయం చేసుకుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ సేన ఈ స్ఫూర్తిదాయక విజయంతో మరోసారి తమ శక్తిని రుజువు చేసింది. స్వదేశంలో నిర్వహించిన ఈ ఆసియా కప్‌లో భారత్ లీగ్ దశ నుంచి ఫైనల్ వరకూ ఆధిపత్యం చాటింది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్ 4-1 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది.
Details
మళ్లీ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత్
రెండో అర్ధభాగంలో సుఖ్‌జీత్ సింగ్ తొలి గోల్‌తో ఖాతా తెరిచాడు. వెంటనే దిల్‌ప్రీత్ సింగ్ స్కోరు 2-0కు పెంచాడు. అతడే తర్వలోనే మరో గోల్ నమోదు చేసి భారత్ విజయాన్ని మరింత దగ్గర చేశాడు. అనంతరం పెనాల్టీ కార్నర్‌ను అమిత్ రోహిదాస్ గోల్‌గా మార్చి ఆధిక్యాన్ని 4-0కు చేర్చాడు. తర్వాత లభించిన పెనాల్టీ కార్నర్‌ను కొరియా గోల్‌గా మలిచినా, అప్పటికే భారత్ దాదాపు విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి వరకు మరిన్ని గోల్స్ కోసం కొరియా శ్రమించినా భారత రక్షణ గోడను చెరిపేయలేకపోయింది. ఈ విధంగా పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ భారత్ ఆసియా కప్ ట్రోఫీని మళ్లీ ఎత్తుకుంది.