Page Loader
Chess: చరిత్ర సృష్టించిన భారత్.. చెస్ ఒలింపియాడ్‌లో అరుదైన ఘనత
చరిత్ర సృష్టించిన భారత్.. చెస్ ఒలింపియాడ్‌లో అరుదైన ఘనత

Chess: చరిత్ర సృష్టించిన భారత్.. చెస్ ఒలింపియాడ్‌లో అరుదైన ఘనత

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2024
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

చెస్‌ జట్లు ఒలింపియాడ్‌-2024లో భారత్ తన మొట్టమొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. టోర్నీలో మొదటిసారి పసిడి పతకాన్ని గెలచుకొని చరిత్రను సృష్టించింది. ఓపెన్ సెక్షన్ లో భారత్ మరో రౌండ్ మిగిలుండగానే 19 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. కీలకమైన పదో రౌండ్‌లో భారత పురుషుల జట్టు, బలమైన అమెరికాను 2.5-1.5 తేడాతో ఓడించి, 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పతకం దాదాపు ఖాయం చేసుకున్న ఈ జట్టు, 11వ రౌండ్ మిగిలి ఉండగానే రెండో స్థానంలో ఉన్న చైనా కంటే 2 పాయింట్ల ఆధిక్యంలో ఉంది.

Details

పసిడి కోసం మహిళా జట్టు పోరాటం

పదో రౌండ్‌లో భారత పురుషుల జట్టు సత్తా చాటింది. టాప్ సీడ్‌ అమెరికాతో జరిగిన పోరులో, నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 41 ఎత్తుల్లో వెస్లీ చేతిలో ఓడినా, గుకేశ్‌ తెల్లపావులతో 46 ఎత్తుల్లో కరువానాపై విజయం సాధించాడు. విదిత్‌ అరోనియన్‌తో గేమ్‌ను డ్రాగా ముగించగా, అర్జున్‌ ఇరిగేశి 60 ఎత్తుల్లో పెరెజ్‌ లీనియర్‌ను ఓడించి భారత్‌కు కీలక విజయం అందించాడు. మహిళల జట్టు కూడా పసిడి పతకం కోసం గట్టిగా పోరాడుతోంది. పదో రౌండ్‌లో చైనాను 2.5-1.5తో ఓడించి అగ్రస్థానంలో నిలిచింది. దివ్య దేశ్‌ముఖ్‌ తెల్లపావులతో చైనాకు చెందిన షికున్‌పై విజయం సాధించింది.

Details

ఇప్పటివరకూ నాలుగు బంగారు పతకాలు కైవసం

హారిక, వంతిక అగర్వాల్, వైశాలి మూడు గేమ్‌లను డ్రాగా ముగించి జట్టుకు ప్రధాన పాయింట్లు అందించారు. 10 రౌండ్ల తర్వాత భారత మహిళల జట్టు 17 పాయింట్లతో టోర్నమెంట్‌లో ముందంజలో ఉంది. ఇప్పటి వరకు చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్ నాలుగు పతకాలు గెలుచుకుంది. 2014, 2022లో కాంస్య పతకాలను సాధించింది. 2020లో వర్చువల్‌గా జరిగిన టోర్నమెంట్‌లో రష్యాతో కలసి స్వర్ణ పతకం గెలుచుకుంది.