Page Loader
IND vs SA: కోహ్లీ సెంచరీ, రోహిత్, జడేజా మెరుపులు.. టీమిండియా 326 పరుగులు 
కోహ్లీ సెంచరీ, రోహిత్, జడేజా మెరుపులు.. టీమిండియా 326 పరుగులు

IND vs SA: కోహ్లీ సెంచరీ, రోహిత్, జడేజా మెరుపులు.. టీమిండియా 326 పరుగులు 

వ్రాసిన వారు Stalin
Nov 05, 2023
06:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ కప్‌లో భాగంగా కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. తొలుత టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మొదటి నుంచి దూకుడుగా ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 326 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాకు 327 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ(40) మెరుపులు, శ్రేయాస్ అయ్యర్ (77) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్, కింగ్ కోహ్లీ(101) అద్భుతమైన సెంచరీ, చివర్లో జడేజా(29) బౌండరీల మోతతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 దక్షిణాఫ్రికా టార్గెట్ 327 పరుగులు