Page Loader
ఐర్లాండ్ సిరీస్‌పై కన్నేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో కీలక ఆటగాడి స్థానంలో పేసర్‌కు అవకాశం!
ఐర్లాండ్ సిరీస్‌పై కన్నేసిన భారత్.. కీలక ఆటగాడి స్థానంలో పేసర్‌కు అవకాశం!

ఐర్లాండ్ సిరీస్‌పై కన్నేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో కీలక ఆటగాడి స్థానంలో పేసర్‌కు అవకాశం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2023
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత్ జట్టు టీ20 సిరీస్‌పై కన్నేసింది. ఇప్పటికే మూడు మ్యాచుల సిరీస్‌లో 1-0 అధిక్యంలో ఉన్న టీమిండియా, రెండో టీ20ల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఆదివారం డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో రెండో టీ20లో భారత్ తలపడనుంది. ఇక మ్యాచులో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. తొలి టీ20లో నిరాశపరిచిన అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన పెట్టాలని భారత మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అతడి స్థానంలో మరో పేసర్ అవేష్ ఖాన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Details

టీమిండియా, ఐర్లాండ్ తుది జట్టులోని సభ్యులు వీరే!

ఇక బ్యాటింగ్‌లో ఒకవేళ మార్పులు చేయాలనుకుంటే సంజు శాంసన్‌ను పక్కన పెట్టి జితేశ్ శర్మకు అవకాశం ఇవొచ్చు. మరోవైపు ఐర్లాండ్ జట్టులో ఒక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆల్ రౌండర్ డాక్రెల్ స్థానంలో గ్రెత్ డెలానీకి ఛాన్స్ ఇవ్వాలని ఐరీష్ జట్టు భావిస్తోంది. భారత్‌ జట్టు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), తిలక్ వర్మ, రింకూసింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్‌ ఖాన్‌, బుమ్రా(కెప్టెన్‌), రవిబిష్ణోయ్ ఐర్లాండ్ జట్టు పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్‌), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్‌ కీపర్‌), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్‌ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్