Loading...
WTC Points Table 2025-27: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌ నాలుగో స్థానం.. ఫైనల్‌ అవకాశాలకు దెబ్బ!
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌ నాలుగో స్థానం.. ఫైనల్‌ అవకాశాలకు దెబ్బ!

WTC Points Table 2025-27: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌ నాలుగో స్థానం.. ఫైనల్‌ అవకాశాలకు దెబ్బ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2026
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

వెల్లింగ్టన్‌ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన తొలి టెస్టు సోమవారం డ్రాగా ముగిసింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియా నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. అయితే భారత జట్టు పాయింట్ల శాతం (పీసీటీ) 50.00కి పడిపోయింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలన్న భారత్‌ ఆశలకు మరింత గండి పడింది.

వివరాలు

టాప్‌-2లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా

మరోవైపు న్యూజిలాండ్‌ జట్టు టాప్‌-2 స్థానాల నుంచి కిందకు పడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు పీసీటీ 66.66గా ఉంది. దక్షిణాఫ్రికా 75.00 పీసీటీతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

నవంబర్‌ 23 నుంచి 27 వరకు బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్టులో విజయం సాధిస్తే.. అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునే అవకాశం ప్రొటీస్‌కు ఉంది.

ఆస్ట్రేలియా 69.23 పీసీటీతో రెండో స్థానానికి చేరుకుంది.

న్యూజిలాండ్‌తో స్వదేశంలో నాలుగు టెస్టులు ఆడిన తర్వాత.. 2027 జనవరిలో భారత్‌తో ఐదు మ్యాచ్‌ల బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఆసీస్‌ తలపడనుంది.

వివరాలు

తొలి టెస్టు మ్యాచ్‌ సారాంశం ఇదే

తొలి ఇన్నింగ్స్‌లో హెన్రీ నికోల్స్‌ అజేయంగా 175 పరుగులు చేయగా.. గ్లెన్ ఫిలిప్స్‌ 118 పరుగులతో రాణించాడు.

వీరిద్దరూ ఆరో వికెట్‌కు ఏకంగా 216 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒక దశలో న్యూజిలాండ్‌ 70/5తో కష్టాల్లో పడినప్పటికీ.. ఈ జోడీ జట్టును ఆదుకుంది. దీంతో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైంది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ భారీ స్కోరు సాధించింది.

టాప్‌-7లోని ఆరుగురు బ్యాటర్లు కనీసం 75 పరుగుల చొప్పున చేయడంతో టీమ్‌ఇండియా 720/9 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. దీంతో భారత్‌కు 352 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

ADVERTISEMENT

వివరాలు

చివరి రోజు వికెట్లు కాపాడుకున్న కివీస్

భారీ ఆధిక్యంలో ఉన్న భారత్‌.. చివరి రోజు న్యూజిలాండ్‌ను ఆలౌట్‌ చేసి విజయం సాధించాలని భావించింది.

అయితే ఎనిమిది వికెట్లు చేతిలో ఉండగా చివరి రోజు ఆటను ప్రారంభించిన కివీస్‌ బ్యాటర్లు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.

వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతూ మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 120 ఓవర్లలో 239/5 స్కోరు చేసింది.

ADVERTISEMENT