Page Loader
పాకిస్థాన్‌లో ఆడితే ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉంది : పీసీబీ ఛీఫ్ 
పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ

పాకిస్థాన్‌లో ఆడితే ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉంది : పీసీబీ ఛీఫ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 12, 2023
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ కు వచ్చి ఆడితే ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉందని పీసీబీ ఛీప్ నజమ్ సేఠీ పేర్కొన్నారు. అందుకే టీమిండియాను పాక్ కు పంపించడానికి బీసీసీఐ ఆలోచిస్తోందని తెలిపారు. అయితే ఆసియా కప్ పాకిస్థాన్ నుంచి తరలిస్తుండటంతో పీసీబీ ఛీఫ్ అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండియన్ బ్రిడ్జి, వాలీబాల్, కబడ్డీ టీమ్స్ పాకిస్తాన్ కు వచ్చాయని, మరి ఇండియన్ క్రికెట్ జట్టు పాకిస్థాన్ కు రావడానికి వచ్చే సమస్య ఏంటీ అని ప్రశ్నించారు. తన అనుమానం ప్రకారం ఇండియాలో అయినా, పాకిస్థాన్ లో అయినా పాక్ చేతుల్లో ఓడిపోతామన్న భయం మాత్రం ఇండియాకు ఉందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో నజమ్ సౌఠీ మాట్లాడారు.

Details

అహ్మదాబాద్ లో పాకిస్థాన్ కు భద్రతాపరమైన సమస్యలు

ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరిగే అవకాశం ఉందన్న వార్తపై ఆయన స్పందించారు. తాను ఇది విన్నప్పుడు చాలా నవ్వుకున్నానని, ఇండియాను రాకుండా చేయడానికి ఇదోక కుట్ర అని చెప్పారు. చైన్నై లేదా కోల్ కతా అని చెప్పి ఉంటే వేరేలా ఉండేదని, అయితే అహ్మదాబాద్ లో పాకిస్థాన్ జట్టుకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నజీమ్ సేఠీ అన్నారు. దీని గురించి తక్కువ మాట్లాడడం మంచిదని, అహ్మదాబాద్ను ఎవరు ఏలుతున్నారో అందరికి తెలుసు కాదా అంటూ ఆసియా కప్ వివాదాన్ని మరింత హీట్ ఎక్కించాడు. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ వేదికను ఎంపిక చేయడం వెనుక రాజకీయ కారణం ఉందని ఆయన చెప్పకనే చెప్పడం గమనార్హం.