Page Loader
ENG vs IND: బజ్‌బాల్‌కు భారత్‌ జంకదు.. మాంటీ పనేసర్ ప్రశంసలు
బజ్‌బాల్‌కు భారత్‌ జంకదు.. మాంటీ పనేసర్ ప్రశంసలు

ENG vs IND: బజ్‌బాల్‌కు భారత్‌ జంకదు.. మాంటీ పనేసర్ ప్రశంసలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 07, 2025
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌ క్రికెట్ చరిత్రలో మరొక మైలురాయిగా నిలిచింది. అసాధ్యంగా భావించిన టార్గెట్‌ను చేధించిన భారత జట్టు ప్రదర్శనపై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా, ఇంగ్లాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ మాట్లాడుతూ ఇంగ్లండ్ బజ్‌బాల్‌ శైలికి ఇతర జట్లు భయపడొచ్చు కానీ భారత్ మాత్రం కాదు. భారత్ ఆటను చూస్తుంటే ఆత్మవిశ్వాసం ఎక్కడెక్కడో కనిపిస్తోంది. బౌలింగ్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది. 20 వికెట్లు తీయడం అత్యద్భుతమైన ఘనత. జస్‌ప్రీత్ బుమ్రా లార్డ్స్‌లో జట్టుతో చేరితే, బౌలింగ్‌ విభాగం మరింత బలపడుతుంది.

Details

గిల్ ఆట అద్భుతం

అదే సమయంలో ఇంగ్లాండ్ బౌలర్ బషీర్ ఎక్కువ పరుగులు ఇవ్వడం వారికి దెబ్బగా మారిందని విశ్లేషించాడు. ఇక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రదర్శనపై ప్రత్యేకంగా మాట్లాడిన పనేసర్, "ఆడటంలో ముందు నుంచి నడిపించిన గిల్ నాయకత్వంలో ఎంతో ప్రావీణ్యం చూపించాడు. గెలుపుతో జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ తొలి విజయం సాధించడంతో చరిత్రలో నిలిచిపోయే క్షణాలను రాశారని ప్రశంసించాడు.

Details

గిల్‌ను కోహ్లీతో పోల్చొద్దు : నాజర్ హుస్సేన్ 

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ కూడా గిల్ నాయకత్వ శైలిని ప్రశంసించారు. ''ఇది గిల్‌కి కెప్టెన్‌గా తొలి సిరీస్. హెడింగ్లేలో ఆయన నాయకత్వం చాలా తక్కువగా అనిపించింది. డగౌట్‌ నుంచి సలహాలు తీసుకుంటూ ఉండేవాడు. కానీ, రెండో టెస్టులో చాలా పరిణతి కనబరిచాడు. గెలిచినప్పుడు ప్రశంసలు, ఓడినప్పుడు విమర్శలు సహజం. కానీ ఇప్పుడు గిల్ తనదైన శైలిలో, సీనియర్ల సహకారం తీసుకుంటూనే స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటూ, నిజమైన కెప్టెన్‌గా ఎదుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని హుస్సేన్ వ్యాఖ్యానించారు. అలాగే విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ వంటి కెప్టెన్లతో గిల్‌ను పోల్చడం తగదు. శుభ్‌మన్ మైదానంలో ప్రశాంతంగా ఉండే వ్యక్తి. అలాంటి నడిపించే శైలి కూడా చాలా ప్రత్యేకమైనదని ఆయన స్పష్టం చేశారు.