Page Loader
WORLD NO.1 INDIA : ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా భారత్ .. కీలకంగా మారనున్న ఆస్ట్రేలియా సిరీస్  
కీలకంగా మారనున్న ఆస్ట్రేలియా సిరీస్ కీలకంగా మారనున్న ఆస్ట్రేలియా సిరీస్

WORLD NO.1 INDIA : ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా భారత్ .. కీలకంగా మారనున్న ఆస్ట్రేలియా సిరీస్  

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 19, 2023
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్-2023 అద్భుత విజయంతో టీమిండియా నూతనోత్సాహంగా నిండి ఉంది. ఈ నేపథ్యంలోనే వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్‌కు మరింత చేరువ కాగలిగింది. వరల్డ్ కప్‌కు వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ జట్టుగా ఎవరు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అంశం ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టాప్ ర్యాంక్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. త్వరలోనే ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌ను భారతదేశం కైవసం చేసుకుంటే, వరల్డ్ కప్‌లో నెంబర్ వన్ టీమ్‌గా అడుగుపెడుతుంది. అయితే ఇందుకు ఆస్ట్రేలియా, పాక్ రూపంలో ముప్పు పొంచి ఉంది.

details

అస్ట్రేలియాతో భారత్ ఢీ.. తేలిపోనున్న ప్రపంచ క్రికెట్ రారాజు 

ఆసియా కప్‌ ఫైనల్లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్ వరల్డ్ కప్‌ ప్రత్యర్థులకు తీవ్ర హెచ్చరికలు పంపించినట్టైంది. బౌలింగ్‌లో కాస్త బలహీనపడ్డట్టు కనిపించినా ఆదివారం శ్రీలంకతో జరిగిన పైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్‌పై ఉన్న అనుమానాలు మాయమయ్యాయి. స్టార్ ఫేసర్ మొహమ్మద్ సిరాజ్‌ బౌలింగ్ అటాక్ వల్ల శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు కుప్పకూలిపోయారు. ప్రపంచ కప్‌ వరకు పాక్‌ ఆడేందుకు మ్యాచ్‌లు లేవు. ఈ క్రమంలోనే భారత్ కంగారుల జట్టుతో వన్డే సిరీస్‌ ఆడనుంది. ఈ మేరకు ప్రపంచ క్రికెట్ రారాజు ఎవరో, నెంబర్ వన్ జట్టు ఏదో స్పష్టం కానుండటం గమనార్హం.సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో మూడు వన్డేలు జరగనున్నాయి.