IND vs NZ: పుణే టెస్టులో భారత్ పరాజయం.. సిరీస్‌ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్
పుణే వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 113 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో సిరీస్‌ను 2-0తో కివీస్ కైవసం చేసుకుంది. భారీ లక్ష్యమైన 359 పరుగులకోసం బరిలో దిగిన టీమిండియా కేవలం 245 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ మరోసారి భారత బ్యాటర్ల నడ్డి విరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన శాంట్నర్, టీమిండియా విజయ అవకాశాలను దెబ్బతీశాడు. అతడితో పాటు అజాజ్ పటేల్ రెండు వికెట్లు, ఫిలిప్స్ ఒక వికెట్ తీసి భారత ఆటగాళ్లను కట్టడి చేశారు.
ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ గా శాంట్నర్
భారత జట్టులో యశస్వీ జైశ్వాల్ 77 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 232 పరుగులకే ఆలౌట్ కాగా, కెప్టెన్ టామ్ లాథమ్ (86) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగుల ఆధిక్యంతో భారత్ ముందుకు భారీ టార్గెట్ ఇచ్చిన కివీస్, భారత్‌ను 359 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కానీ ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో రోహిత్ సేన పూర్తిగా విఫలమైంది. కాగా, ఈ టెస్టులో శాంట్నర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి మొత్తం 13 వికెట్లతో కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. శాంట్నర్ ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.