Ind Vs Pak: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అత్యధిక రన్స్ చేసింది ఎవరో తెలుసా
ప్రపంచ కప్ చరిత్రలో ఆడిన ప్రతీసారి భారత్ పాకిస్థాన్‌ను ఓటమిపాలు చేసింది. పాకిస్థాన్‌పై భారత్ రికార్డు 7-0గా ఉంది. ప్రపంచ కప్ భారత్-పాక్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్లు ఎవరో తెలుసా. 1. సచిన్ టెండూల్కర్ 1992 ప్రపంచకప్ నుంచి 2011 వరకు మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన సచిన్, 5 ఇన్నింగ్స్‌ల్లో కలిపి అత్యధికంగా 313 పరుగులు పిండుకున్నాడు. 78.25 సగటుతో 3సార్లు అర్థశతకాలను బాదాడు. 2. విరాట్ కోహ్లీ ఈ జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. 2011 నుంచి 2019 వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ పాకిస్తాన్‌పై 193పరుగులు చేశాడు. 64.33 సగటున సెంచరీతో పాటు అర్ధశతకం సాధించాడు.
నేటి మ్యాచులో రోహిత్, కోహ్లీ చెలరేగితే మరో రికార్డుకు అవకాశం
3. రోహిత్ శర్మ మూడో స్థానంలో రోహిత్ కొనసాగుతున్నాడు. 2015నుంచి 2019వరకు 2 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 2 ఇన్నింగ్స్‌ల్లో 155 రన్స్ చేశాడు. అత్యధికంగా 140 పరుగులు చేయగా 77.50సగటుతో ఉన్నాడు. 4.మహ్మద్ అజారుద్దీన్ 1992 నుంచి 1999 వరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో 39.33 సగటుతో అజారుద్దీన్ 118రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు 59. 5.సురేష్ రైనా టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనా 2011 ప్రపంచకప్ నుంచి 2015 వరకు పాకిస్థాన్‌తో రెండు మ్యాచ్‌ల్లో ఆడాడు. దీంతో రెండు ఇన్నింగ్స్‌లలో మొత్తం 110 పరుగులు చేశాడు. 74 పరుగులతో అత్యధిక స్కోరును నమోదు చేశాడు.