LOADING...
Champions Trophy: రేపటి సెమీఫైనల్ కోసం సిద్ధమైన భారత్.. పిచ్, ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో చూడండి! 
రేపటి సెమీఫైనల్ కోసం సిద్ధమైన భారత్.. పిచ్, ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో చూడండి!

Champions Trophy: రేపటి సెమీఫైనల్ కోసం సిద్ధమైన భారత్.. పిచ్, ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో చూడండి! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 చివరి దశకు చేరుకుంది. ఇంకా మూడు మ్యాచ్‌ల తర్వాత ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందో తేలిపోనుంది. ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా - ఈ నాలుగు జట్లలో ఏది వరుసగా రెండు విజయాలు సాధిస్తే, అది ఛాంపియన్ అవుతుంది. తొలుత టీమిండియా సెమీ ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ దుబాయ్‌ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. సెమీస్‌లో ఆసీస్‌ను ఓడిస్తే, ఫైనల్‌లో సౌతాఫ్రికా లేదా న్యూజిలాండ్‌తో పోటీ పడే అవకాశం ఉంది. అయితే ముందుగా సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించాల్సిన అవసరం టీమిండియాకు ఉంది.

Details

ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా భారత్

భారత్ ఐసీసీ టోర్నమెంట్లలో ఆసీస్‌ను నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓడించిన రికార్డు కలిగి ఉంది. కానీ 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో రోహిత్‌ సేన పరాజయం పాలైంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని క్రికెట్‌ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇంత భారీ అంచనాలు ఉన్న ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగుతుంది? పిచ్ పరిస్థితి ఏంటి? వర్షం వచ్చే అవకాశముందా? టాస్ గెలిస్తే రోహిత్‌ శర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడు? వంటి అంశాలను పరిశీలిద్దాం.

Details

 మ్యాచ్ వివరాలు 

తేదీ: 2025 మార్చి 4, మంగళవారం స్థలం: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ప్రారంభ సమయం: మధ్యాహ్నం 2:30 గంటలకు (IST) ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ & జియో హాట్‌స్టార్ లైవ్ స్ట్రీమింగ్

Details

పిచ్, వాతావరణం

దుబాయ్‌లో మ్యాచ్‌ జరిగే రోజు ఉష్ణోగ్రత సుమారు 24°C ఉండే అవకాశం ఉంది. పిచ్‌ మొదట బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉంటుంది, కానీ మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్నర్లకు ఎక్కువ సాయపడే అవకాశం ఉంది. రోహిత్ శర్మ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 250 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడింది. ఈ నేపథ్యంలో సెమీస్‌లోనూ రోహిత్ అదే వ్యూహాన్ని అమలు చేయవచ్చు. అయితే, ఈ పిచ్‌పై ఇప్పటివరకు 63శాతం సందర్భాల్లో ఛేజింగ్‌ చేసిన జట్లు విజయం సాధించాయి. అయినా ప్రస్తుత ఫార్మాట్‌లో రెండో ఇన్నింగ్స్ అంతగా సులభంగా లేదని రోహిత్‌ న్యూజిలాండ్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.

Details

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా - ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డు 

ఇండియా, ఆసీస్ ఛాంపియన్స్‌ ట్రోఫీలో నాలుగు సార్లు తలపడగా, భారత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది, ఒక మ్యాచ్‌లో ఆసీస్ గెలిచింది, మరొక మ్యాచ్‌కు ఫలితం రాలేదు. భారత జట్టు కూర్పు, వ్యూహం భారత్ న్యూజిలాండ్‌పై ఆడిన అదే జట్టుతో ఆసీస్‌పై కూడా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. జట్టులో రెండు స్పిన్నర్లు, ఒక ప్రధాన పేసర్, ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉండేలా కూర్పు ఉండొచ్చు. రోహిత్‌ శర్మ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటే, అదే వ్యూహం విజయాన్ని సాధించడానికి ఉపయోగపడొచ్చు. ఈ ప్రతిష్టాత్మక సెమీఫైనల్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి!

Details

ఇరు జట్లలోని ప్లేయర్లు వీరే

టీమిండియా ప్లేయింగ్‌ 11(అంచనా) రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11(అంచనా) మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్‌, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షియస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.