Loading...
IND w Vs SL w: ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి బంగారు పతకం.. శ్రీలంకపై ఘన విజయం
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి బంగారు పతకం.. శ్రీలంకపై ఘన విజయం

IND w Vs SL w: ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి బంగారు పతకం.. శ్రీలంకపై ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2026
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రీడల్లో భారత్‌ స్వర్ణ పతకాల ఖాతా తెరిచింది. మహిళల క్రికెట్‌ ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియా అద్భుత విజయాన్ని అందుకుని పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. తుది పోరులో శ్రీలంకను ఏకంగా 147 పరుగుల తేడాతో ఓడించి స్వర్ణాన్ని దక్కించుకుంది. ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు 69 పరుగులకే ఆలౌటైంది.

వివరాలు

147 పరుగుల తేడాతో విజయం

దీంతో భారత్‌ 147 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌ స్వర్ణ పతకాన్ని అందుకుంది.

కాగా మహిళల క్రికెట్‌ ఫైనల్‌కు ముందు జరిగిన కాంస్య పతక పోరులో పాకిస్థాన్‌ విజయం సాధించింది.

బంగ్లాదేశ్‌తో జరిగిన కాంస్య పోరులో పాకిస్థాన్‌ గెలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

ADVERTISEMENT