LOADING...
Asian Games 2023: టెన్నిస్‌లో భారత్ కు షాక్.. రెండో రౌండ్‌లో రోహన్న బోపన్న-యూకీ బాంబ్రీ జోడి ఓటమి
టెన్నిస్‌లో భారత్ షాక్.. రెండో రౌండ్‌లో రోహన్న బోపన్న-యూకీ బాంబ్రీ జోడి ఓటమి టెన్నిస్‌లో భారత్ షాక్.. రెండో రౌండ్‌లో రోహన్న బోపన్న-యూకీ బాంబ్రీ జోడి ఓటమి

Asian Games 2023: టెన్నిస్‌లో భారత్ కు షాక్.. రెండో రౌండ్‌లో రోహన్న బోపన్న-యూకీ బాంబ్రీ జోడి ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2023
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా గేమ్స్‌లో భారత టెన్నిస్‌కు భారీ షాక్ తగిలింది. భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న- యూకీ బాంబ్రీ జోడీ ఆసియా గేమ్స్ నుంచి నిష్క్రమించారు. రెండో రౌండ్ లో ఈ జోడీ ఉబ్బెకిస్తాన్ ద్వయం సెర్గీ ఫోమిన్, కుమోయిన్ సుల్తానోవ్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2-6, 6-3, 10-6 తేడాతో రోహన్న బోపన్న-యూకీ బాంబ్రీ జోడీ ఓటమిపాలైంది. బోపన్న డబుల్స్‌లో టాప్-10 ప్లేయర్‌గా ఉండగా, భాంబ్రీ కూడా టాప్-100 ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఈ ఓటమితో గోల్డ్ మెడల్ ఆశలు ఆవిరయ్యాయి. ఈ మ్యాచ్‌లో బోపన్నకు భాంబ్రీ నుంచి సరైన మద్దతు లభించలేదని భారత కోచ్ జీషన్ అలీ అభిప్రాయపడ్డాడు.

Details

ఉమెన్స్ సింగల్స్ లో రెండో రౌండుకు చేరిన అంకిత రైనా

43 ఏళ్ల బోపన్న తన చివరి ఆసియా క్రీడలను ఆడుతున్నాడు. అతను 2018 ఎడిషన్‌లో దివిజ్ శరణ్‌తో కలిసి స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఉమెన్స్ సింగిల్స్‌లో భాగంగా భారత్‌కు చెందిన అంకితా రైనా ఉబ్బెకిస్తాన్ క్రీడాకారిణి సబ్రినాను ఓడించి రెండో రౌండుకు అర్హత సాధించింది. మరోవైపు రామ్ కుమర్ రామనాథన్, రుతుజా భోసాలెలు కూడా రెండో రౌండుకు దూసుకెళ్లారు.