Sunil Gavaskar: కివీస్‌ను ఓడించి ఆసీస్‌తోనే భారత్ సెమీస్ ఆడాలి: సునీల్ గావస్కర్
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ స్టేజ్‌లో భారత్ తన చివరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
ఓడిన జట్టు మరో సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది.
ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా కివీస్‌పై గెలిచి, సెమీస్‌లో ఆస్ట్రేలియాతోనే ఆడాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావాస్కర్ సూచించాడు.
దీనికి గల కారణాన్ని ఆయన విశ్లేషించాడు. సెమీస్‌కు చేరిన జట్లలో ఏదీ తక్కువ కాదు. నాకౌట్ దశలో ఒక్క తప్పిదం చేసినా ప్రయాణం అక్కడితో ముగిసిపోతుంది.
Details
ఆసీస్ లో ప్రధాన బౌలర్లు లేరు
కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీమ్‌ఇండియా సెమీస్‌లో ఆస్ట్రేలియాతోనే తలపడితే మంచిదని పేర్కొన్నారు. ప్రస్తుత ఆసీస్ జట్టులో ప్రధాన బౌలర్లు లేరు.
టీమిండియాతో పోలిస్తే అనుభవం తక్కువ. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ లాంటి కీలక బౌలర్లు ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.
అయితే, గ్రూప్ దశలో బ్యాటర్లు రాణించడంతో ఆసీస్ సెమీస్ చేరిందని గావస్కర్ వివరించాడు.