LOADING...
ENG vs IND : ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా.. 2026 షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ 
ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా.. 2026 షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ

ENG vs IND : ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా.. 2026 షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత పురుషుల జాతీయ క్రికెట్ జట్టు మరోసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. 2026లో జూలై నెలలో టీమిండియా ఇంగ్లాండ్‌కి పయనించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు మొత్తం ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ శ్రేణి మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం, జూలై 1 నుంచి 11 వరకు టీ20 సిరీస్ కొనసాగనుండగా, వన్డే సిరీస్ జూలై 14న ప్రారంభమై 19 వరకు జరగనుంది.

వివరాలు 

టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే.. 

తొలి టీ20 మ్యాచ్ - 2026 జూలై 1న‌ - డర్హమ్‌లో రెండో టీ20 మ్యాచ్ - 2026 జూలై 4న‌ - మాంచెస్ట‌ర్‌లో మూడో టీ20 మ్యాచ్ - 2026 జూలై 7న‌ -నాటింగ్హమ్‌లో నాలుగో టీ20 మ్యాచ్ - 2026 జూలై 9న - బ్రిస్టల్‌లో ఐదో టీ20 మ్యాచ్ - 2026 జూలై 11న - సౌతాంప్టన్‌లో

వివరాలు 

వ‌న్డే సిరీస్ షెడ్యూల్ ఇదే.. 

తొలి వ‌న్డే - జూలై 14న - బర్మింగ్హమ్‌లో రెండో వ‌న్డే - జూలై 16న - కార్డిఫ్‌లో మూడో వ‌న్డే - జూలై 19న లార్డ్స్‌లో