
India U19 Squad: ఆస్ట్రేలియా టూర్ కి భారత అండర్-19 జట్టును ప్రకటించిన బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు భారత అండర్-19 జట్టును ప్రకటించింది. ఈ పర్యటనలో భారత్ అండర్-19 జట్టు, ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు మల్టీ-డే మ్యాచ్‌ల్లో తలపడనుంది. సెప్టెంబర్ 2025లో జరగనున్న ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను ప్రపంచానికి నిరూపించుకునే దశగా మారనుంది.
వివరాలు
వైభవ్ సూర్యవంశీ ఎంపిక
వయస్సు కేవలం 14 ఏళ్లే అయినా, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ జట్టులో చోటు దక్కించుకోవడం గర్వకారణం. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో అతడు చేసిన అద్భుత ప్రదర్శన కారణంగానే ఈ ఎంపిక జరిగిందని తెలుస్తోంది. ఇంగ్లండ్ జరిగిన యూత్ వన్డే సిరీస్‌ను భారత యువ జట్టు 3-2 తేడాతో గెలుచుకోగా, రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. ఇక, ఆ టూర్‌లో మెరిసిన వైభవ్, ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.
వివరాలు
ఆయుష్ మాత్రే నాయకత్వం
ఈ పర్యటనకు కెప్టెన్‌గా ఆయుష్ మాత్రే ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనలోనూ అతడు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. తన సారథ్యంలో జట్టు ఆకట్టుకునే ఆటతీరు కనబరిచింది. ఈసారి ఆస్ట్రేలియా గడ్డపైనూ తన నాయకత్వంలో జట్టు ఘన విజయాలు సాధిస్తుందని ఆశిస్తున్నారు. టూర్ షెడ్యూల్ ఈ పర్యటన సెప్టెంబర్ 21న ప్రారంభం కానుంది. మూడు వన్డే మ్యాచ్‌లు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకూ నిర్వహించనున్నారు. తొలి మల్టీ-డే మ్యాచ్ కూడా ఇదే కాలంలో జరగనుంది. ఇక రెండవ మల్టీ-డే మ్యాచ్ అక్టోబర్ 7 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లు ప్రధానంగా నార్త్స్‌లో జరుగనున్నాయి. అయితే రెండవ మల్టీ-డే మ్యాచ్ మాకేలో (Mackay) ఆడనున్నారు.
వివరాలు
ఆస్ట్రేలియా గడ్డపై సవాల్
ఇంగ్లండ్ టూర్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో భారత యువ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆ ఉత్సాహాన్నే కొనసాగిస్తూ ఆస్ట్రేలియన్ నేలపై గెలుపుపథాన్ని కొనసాగించాలని భారత యువ ఆటగాళ్లు సంకల్పించారు. ఇక ప్రత్యర్థి జట్టు అయిన ఆస్ట్రేలియా అండర్-19 టీం మాత్రం తక్కువేమీ కాదు.. వారు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో మెరుగైన ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు.
వివరాలు
జట్టు వివరాలు
ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిగ్యాన్ కుండు (వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, నామన్ పుష్పక్, హేనిల్ పటేల్, డి. దీపేష్, కిషన్ కుమార్, అన్మోల్‌జీత్ సింగ్, ఖిలన్ పటేల్, ఉధవ్ మోహన్, అమన్ చౌహాన్ కలరు.