Ruthuraj : ఆస్ట్రేలియాను బెంబెలెత్తించిన రుతురాజ్ గైక్వాడ్.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం
భారతదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా తొలుత టాస్ ఓడింది. టాస్ గెలిచిన కంగారులు బౌలింగ్ ఎంచుకున్నారు. ఈ మేరకు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కంగారూల దెబ్బకు తడబడింది. శ్రేయేస్ తప్ప మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. కానీ ఈ మ్యాచ్‌లో పది పరుగులు చేసిన భారత ఓపెనర్ రుతురాజ్ ఓ కొత్త రికార్డును నెలకొల్పాడు. బెంగళూరు వేదికగా జరిగిన టీమిండియా, ఆస్ట్రేలియా ఐదో టీ20లో అద్భుత ఫామ్ కొనసాగించిన డాషింగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 12 బాల్స్ ఆడి పది పరుగులు చేసిన గైక్వాడ్, టీ20ల్లోని ద్వైపాక్షిక సిరీస్‌లో ఆస్ట్రేలియా మీద అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
మొత్తంగా మూడో స్థానంలో కొనసాగుతునన రుతురాజ్
5 మ్యాచుల సిరీస్‌లో5కి ఐదు మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ 223 పరుగులు బాదాడు. ఇదే సమయంలో విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డుకు గైక్వాడ్ కేవలం 8 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. టీ20లకు సంబంధించి ఒక ద్వైపాక్షిక సిరీస్‍లో అత్యధిక రన్స్ నమోదు చేసిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కోహ్లి 231 పరుగులు బాదాడు. ఆసీస్‌తో ఐదో టీ20లో మరో 19 పరుగులు చేసుంటే గైక్వాడ్, కోహ్లి రికార్డును అధిగమించేవాడు. 10కే అవుట్ కావడంతో కోహ్లి రికార్డు చెక్కుచెదరలేదు. ఈ జాబితాలో 224 పరుగులతో కేఎల్ రాహుల్ రెండో స్థానంలో నిలిచాడు.