Page Loader
IND vs BAN: బంగ్లాతో రెండో టెస్టు.. టాస్‌ నెగ్గిన భారత్‌ 
బంగ్లాతో రెండో టెస్టు.. టాస్‌ నెగ్గిన భారత్‌

IND vs BAN: బంగ్లాతో రెండో టెస్టు.. టాస్‌ నెగ్గిన భారత్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 27, 2024
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-బంగ్లాదేశ్‌ (IND vs BAN) రెండో టెస్టు వేళైంది.నిన్న రాత్రి వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారిపోయింది,అందువల్ల టాస్‌ 9 గంటలకు కాకుండా 10 గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా, టీమిండియా టాస్‌ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్‌ను ఎంచుకున్నాడు. ఆట 10.30 గంటలకు ప్రారంభవవుతుంది. రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. క్లీన్‌స్వీప్‌ సాధించి టీ20 సిరీస్‌కు వెళ్లాలని టీమ్‌ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, ఈ మ్యాచ్‌లో గెలిచినప్పుడు సిరీస్‌ను సమం చేయాలని బంగ్లా చూస్తోంది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని అంచనా వేయబడినప్పటికీ, భారత్ ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగింది. మొదటి టెస్టులో ఆడిన టీమ్‌తోనే, రెండింటిలోనూ టీమిండియా బరిలోకి దిగుతోంది.

వివరాలు 

తుది జట్లు

భారత్‌: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ బంగ్లాదేశ్‌: షద్మాన్ ఇస్లాం, జాకీర్‌ హసన్, నజ్ముల్‌ శాంటో, మొమినుల్‌ హక్, ముష్ఫికర్, షకిబ్, లిటన్‌ దాస్, మెహిదీ హసన్‌ మిరాజ్, తైజుల్, హసన్‌ మహమూద్, ఖలెద్‌