నేడు టీమిండియాతో తలపడనున్న ఇంగ్లాండ్.. గువహటిలో ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్
ప్రపంచ కప్-2023లో భాగంగా నేడు భారత్ ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్ జరగనుంది.అస్సాం గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో టీమిండియాతో ఇంగ్లీష్ జట్టు తలపడనుంది. మరోవైపు తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. రెండు మ్యాచులు మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్ లో ప్రత్యక్షప్రసారం కానుంది. జట్టు: రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్(వి), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ , శార్దూల్ ఠాకూర్ రోహిత్ కెప్టెన్ గా ప్రపంచకప్ సమరానికి వేళ అయ్యిందని బీసీసీఐ ట్వీట్ చేసింది.